Yashoda: పాపం “యశోద”.. టీజర్ తో అంచనాలను పెంచేసిన సమంత..!

Yashoda: సమంత లేడీ ఓరియంటెడ్ కథలో నటిస్తున్న చిత్రం యశోద.. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఈ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసాయి.. హరి హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.. తాజాగా యశోద టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..

Samantha Yashoda Movie Teaser out now
Samantha Yashoda Movie Teaser out now

ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.. ఇందులో సమంత ప్రెగ్నెంట్ గా కనిపిస్తుంది. ఈ టీజర్ లో డాక్టర్ సమంతాను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏ ఏ పనులు అయితే చేయవద్దని చెబుతుందో.. సమంత అలాంటి పనులే చేస్తుంది.. ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. వాళ్ళ నుంచి సమంత తప్పించుకోవడం.. ఒక ప్రెగ్నెంట్ ఏవైతే పనులు చేయకూడదో అందులో సమంత అవే పనులు చేస్తుంది.. మొత్తానికి ఈ టీజర్ తో సమంత యశోద సినిమాపై అంచనాలను ఆకాశానికి ఎత్తేసింది. ఈ టీజర్ లో సమంత యాక్టింగ్ చూసి అభిమానుల సైతం ఫిదా అయ్యారు.. ఇక సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు..

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు టాక్.. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.. ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి.. ఈ సినిమాలో సమంత ను మునుపెన్నడు చూడని పాత్రలో నటిస్తోంది.. సమంత యాక్షన్ తన సినిమా పై క్యూరియాసిటిని పెంచేసింది..

Advertisement