Prabhas : మహత్తర కార్యానికి పూనుకున్న ప్రభాస్.. 12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రయాణం..!!

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ఒక మహత్తర కార్యానికి పూనుకొని దాదాపు 12 సంవత్సరాల తర్వాత మొగల్తూరుకు పయనమయ్యారు. ఇక ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యతో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక ఈయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.. రాజకీయరంగంలో కూడా కేంద్ర మంత్రిగా పదవి స్వీకారం చేసి ఎన్నో మంచి పనులు చేపట్టిన కృష్ణంరాజు మరణం అటు రాజకీయ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత కృష్ణంరాజు మరణానికి తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే వారి కుటుంబ సభ్యులను దగ్గరుండి మరి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ప్రభాస్ కి కూడా జీవితంలో కొలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల 28వ తేదీన కృష్ణంరాజు గారి అంత్యక్రియల తర్వాత జరిగే కొన్ని ముఖ్యమైన ఘట్టాలను పూర్తి చేయడం కోసం తన స్వగ్రామం భీమవరంలోని మొగల్తూరుకు పయనం అవుతున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇలా ప్రభాస్ మొగల్తూరుకు వెళుతుండగా అక్కడ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజులపాటు స్వగ్రామంలోనే ప్రభాస్ ఉండనున్నారు. ఇక 29వ తేదీన పెదనాన్న సంస్మరణ సభలో పాల్గొనడమే కాకుండా భారీగా అన్న సమారాధన కార్యక్రమం కూడా చేయనున్నారు. ఇక ఈ సంస్మరణ సభకు కొన్ని వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోనున్నారు. ఇక వారికోసం భారీగా భోజన ఏర్పాట్లు కూడా చేయబోతున్నారు ప్రభాస్.

Prabhas who has embarked on a great work.. Travel to Mughaltur after 12 years..!!
Prabhas who has embarked on a great work.. Travel to Mughaltur after 12 years..!!

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన కృష్ణంరాజు 1966 లో చిలక గోరింక అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఆ తర్వాత భక్త కన్నప్ప, జీవన తరంగాలు, కృష్ణవేణి, సీతారాములు, బొబ్బిలి బ్రహ్మన్న, మరణ శాసనం, అంతిమ తీర్పు, విశ్వనాథ నాయకుడు, బావబామ్మర్ది లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇకపోతే చివరిసారిగా ప్రభాస్ తో రాధే శ్యామ్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు కృష్ణంరాజు. ఇక అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన మరణం అందరిని శోకసంద్రంలోకి ముంచేసింది. ఏమైనా ఇంతటి గొప్ప నటుడిని ఇండస్ట్రీ కోల్పోయిందని చెప్పవచ్చు.

Advertisement