Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఒకరు.. ప్రభాస్ అనుష్క లవ్ లో ఉన్నారని వాళ్ళిద్దరూ త్వరలో పెళ్లి పీటలేకపోతున్నారని గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ప్రభాస్ అన్ స్టాపబుల్ షో లో అనుష్క గురించి తన లవ్ మేటర్ చెబుతాడని అంతా అనుకుంటుంటే.. న్యూ ఇయర్ కి తను మరో బ్యూటీతో జతకట్టనున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో ఊపందుకుంది.. నిజంగా ఈ విషయం నిజమైతే అనుష్క గుండె ఆగిపోవడం ఖాయం అంటున్నారు నేటిజన్స్. ఇంతకీ ఆ మేటర్ ఏంటంటే..

ఇటీవల ఉమైర్ సంధు ప్రభాస్ కృతి సనన్ ప్రేమలో ఉన్నారని రూమర్ స్ప్రెడ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉమైర్ సెక్సీయస్ట్ కపుల్ ప్రభాస్ కృతి సనన్ తమ న్యూ ఇయర్ ను మాల్దీవ్స్ లో గడపనున్నారు అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ట్వీట్ ఫ్యాన్స్ మాత్రం దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. సిగ్గు లేదా బుద్ధి లేదా అంటూ మండిపడుతున్నారు. మరికొందరైతే నువ్వైనా ఇలాంటి న్యూస్ తో ఎంటర్టైన్ చేస్తున్నావ్ అంటూ లైట్ తీసుకున్నారు. కానీ ఇదే నిజమైతే మాత్రం అనుష్క గుండె ఆగిపోవడం ఖాయం అంటున్నారు ఆమె ఫ్యాన్స్. గత కొన్నాళ్లుగా ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటే చూడాలని సినీ ప్రేక్షకులతో పాటు వారి అభిమానులు కూడా కోరుకుంటున్నారు.