Prabhas: ప్రభాస్ హాస్పిటల్ లో..! ఏమైందంటే..!?

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ప్రభాస్ కి సంబంధించిన ఈ చిన్న విషయాన్నైనా ఆయన అభిమానులు వైరల్ చేస్తుంటారు.. తాజాగా ప్రభాస్ హాస్పటల్లో కనిపించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.. ఈ వీడియోకి సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు.. కానీ ఈ వీడియో హాట్ టాపిక్ గా మరి చర్చకు తావిచ్చింది.. ప్రభాస్ ఏ హాస్పటల్ కి వెళ్లారో తెలియదు కానీ హాస్పిటల్ లో నడుచుకుంటూ వస్తున్న వీడియో ఒకటి మాత్రం వైరల్ అవుతుంది..

Prabhas in Hospital video viral
Prabhas in Hospital video viral

కొంతమంది ఈ వీడియో పాతదని.. మరికొంతమంది కొత్తదని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటే.. కృష్ణంరాజును చూస్తే ఎందుకు ప్రభాస్ హాస్పిటల్ కి వెళ్ళాడని మరికొందరు అంటున్నారు.. ఈ వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు తనకు ఏమైందంటూ ఆందోళన చెందుతున్నారు.. బాహుబలి సినిమా షూటింగ్లో ప్రభాస్ కాలికి ఇంజురీ అయిన సంగతి తెలిసిందే.. దాని నిమిత్తం యూరప్ లో సర్జరీ కూడా చేయించుకున్నారు.. ఇప్పుడు అదే గాయం మళ్ళీ ఆయనని ఇబ్బంది పడుతుందని.. అందుకోసమే హాస్పిటల్ కి వెళ్ళారేమోనని వార్తలు వినిపిస్తున్నాయి..

ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతోపాటు సలార్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకోంది.  ప్రస్తుతం ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనులు  జరుపుకుంటుంది..