వచ్చే వారంలోనే మహేష్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి..

సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న సంగతి తెలిసింది.. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా వంటి సినిమాలు రాగ అవి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ సినిమా కోసం మహేష్ అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇక సెప్టెంబర్ నుంచి ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ ఏదో ఒక కారణం వల్ల ఈ సినిమా వెనక్కి వెళ్తూనే ఉంది ఇక ఈ వారంలో సినిమా సెట్స్ పైకి వెళ్లడం ఖాయం..

Mahesh Babu Trivikram Movie on sets next week
Mahesh Babu Trivikram Movie on sets next week

సెప్టెంబర్ 12 నుంచి త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమా ఓ కన్ఫర్మేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై త్రివిక్రమ్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఊహాగానాలు మాత్రం నిజమే అనిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఫిట్నెస్ కోసం ఇప్పటినుంచే వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు నిదర్శనమే తాజాగా ఆయన ట్రేడ్ మిల్ పై రిలీజ్ చేసిన వీడియో..

 

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది ఇక రెండవ హీరోయిన్గా ప్రియాంక అరుణ్ మోహన్ను లాక్ చేసినట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో కీలకపాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించినట్టు టాక్.. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.. ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

Advertisement