Super Star Krishna : అసలు సూపర్ స్టార్ కృష్ణ రెండో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది.!? ఆ రోజు ఏం జరిగింది.!?

Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోకి రాకముందే ఇందిరా దేవితో పెళ్లి జరిగింది. 1962 లో ఆయన చదువు పూర్తయ్యాక తన మేన మరుదలు ఇందిరా దేవి తో కృష్ణకు వివాహం జరిపించారు. సినిమాపై మక్కువతో కృష్ణ మద్రాసు వెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలో ఆయన 1965 లో విడుదలైన తేనె మనసులు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు.. ఆ తరువాత వరుసగా హీరో అవకాశాలు వచ్చాయి. బాపు దర్శకత్వంలో తరాకెక్కిన సాక్షి సినిమాలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు. ఆ చిత్రంలో కృష్ణ విజయనిర్మల కెమిస్ట్రీ వెండి తెరపై అద్భుతంగా పండింది. ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగేలా చేసింది. కృష్ణ విజయనిర్మలను రహస్యంగా వివాహం చేసుకున్నారు..

Krishna why married vijayanirmala on indria Devi in her life
Krishna why married vijayanirmala on indria Devi in her life

విజయనిర్మల వ్యక్తిత్వం, తెలివితేటలు నచ్చిన కృష్ణ ఒకరోజు గుడిలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. విజయనిర్మలకు కూడా అది రెండవ వివాహం. నరేష్ మొదటి భర్తకు కలిగిన సంతానం. ఆమెకు మొదటి భర్తతో విభేదాలు ఉన్నాయి. ఇక ఈ రహస్య వివాహాన్ని మొదటి భార్య ఇందిరా దేవి వద్ద కృష్ణ దాచలేదు. విజయనిర్మలను పెళ్లి చేసుకున్నట్లు చెప్పేశారట. ఆ మాట విన్న ఇందిరా దేవి కొద్ది రోజులపాటు మౌనం వహించారట. ఏమీ మాట్లాడకుండా తన అంగీకారం తెలిపారట. ఇందిరా దేవి లోని మరో గొప్ప విషయం ఆమె సవతిని అంగీకరించడం.

కృష్ణ విజయనిర్మలను రెండో వివాహం చేసుకున్న ఆమె అంగీకరించారు. భర్తతో దూరంగా లేకుండా కలిసి ఉన్నారు. కృష్ణ అభిప్రాయాలు ఇష్టాలను గౌరవిస్తూ గొప్ప సతీమణిగా నిరూపించుకున్నారు. అజ్ఞాతవాసంలో ఉండిపోయారు . ఆమె భార్యగా తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ లోప్రొఫైల్ మెయింటైన్ చేశారు.