లైగర్ ఫ్లాప్ ని అందరికంటే ముందు గెస్ చేసిన జూనియర్ ఎన్‌టి‌ఆర్ – అరాచకం బాసూ నువ్వు.!

విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ చిత్రం లైగర్.. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందని అనుకున్నారు.. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయింది.. అందుకు పలు రకాల కారణాలు ఉన్నాయి .. కానీ వీటన్నింటినీ జూనియర్ ఎన్టీఆర్ ముందుగానే అంచనా వేసి ఈ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని అనుకున్నాడట.. దీని వెనక చాలా పెద్ద కథే ఉంది.. అదేంటో ఇప్పుడు చూద్దాం..!!

పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో 2015లో టెంపర్ సినిమా వచ్చింది. అప్పటివరకు వరుస ప్లాపులతో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ కి అటు పూరికి ఇద్దరు సినిమాతో మంచి బూస్టప్ వచ్చింది. టెంపర్ హిట్ అయ్యాక పూరి జగన్నాథ్ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది.. ఎన్టీఆర్ వరుస ప్లాపులతో కూడా బ్రేక్ వచ్చింది.. దీంతో వెంటనే మరోసారి ఎన్టీఆర్ ను ఏదో లాగా ఒప్పించి మరో సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాడు పూరి..

అప్పుడే 2016 లో లైగర్ సినిమా కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడట. అయితే అప్పటికే పూరి జగన్నాథ్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని చేయాలని అనుకున్నాడట. ఈ చిత్రానికి బాక్సర్ అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించారట. అయితే అప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో బాబి జై లవకుశ ప్లాన్ చేశారట.. దాంతో లైగర్ సినిమా కథలో కాస్త తేడా గా అనిపించి జూనియర్ ఎన్టీఆర్ సైడ్ అయ్యారట.. లేదంటే జూనియర్ ఎన్టీఆర్కు 2016లో మరో ఫ్లాప్ పడి ఉండేది.. ఈ విషయం తెలుసుకున్న తారక్ అభిమానులు లైగర్ సినిమా రిజల్ట్ విషయంలో.. ఆరు సంవత్సరాల క్రితంమే కరెక్ట్ గా జడ్జిమెంట్ చేశారని తారక్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారట..