Super Star Krishna : తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభమైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. నిన్న మధ్యాహ్నం సమయంలో కార్డియాక్ అరెస్టు కాగా కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. టాప్ 8 డాక్టర్ల చేత వైద్య పరీక్షలు నిర్వహించినా కూడా ఫలితం లేకపోయింది. మొదట బులెటిన్ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఏ మాత్రం బాగాలేదని.. చికిత్సకు శరీరం అంగీకరించడం లేదు అని వైద్యులు తెలిపారు.

ఇండియాలోనే బెస్ట్ డాక్టర్ లందరూ కూడా ఆయనను కాపాడాలని శాయశక్తులా ప్రయత్నం చేసినప్పటికీ హార్ట్ ఎటాక్ మాత్రమే కాదు ఊపిరితిత్తులతో సహా పలు అవయవాలు పనిచేయకపోవడం వల్లే శరీరం చికిత్సకు సహకరించలేదని వైద్యులు ఆయన మరణం తర్వాత నిర్ధారించారు. ఏది ఏమైనా కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని శోకసంద్రంలో మునిగిపోయింది. ఇదిలా ఉండగా కృష్ణ గారు మరణించిన తర్వాత కొడుకు మహేష్ బాబు చేత తనకు ఆఖరి కోరిక తీర్చుకోవాలని ప్రయత్నం చేశారట. ఈ క్రమంలోనే తండ్రి చివరి కోరికను తీర్చడానికి ఆయన కట్టే కాలకుండానే తండ్రి పార్థివదేహాన్ని పక్కనపెట్టి తండ్రి కోరిక తీర్చబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని అంత అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం చూసి మహేష్ బాబు పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. కృష్ణ మరణించిన తర్వాత తన ఆస్తిలో సగభాగం విజయవాడ , వైజాగ్ , కాకినాడ లోని 3 అనాథ ఆశ్రమాలకి ఇవ్వాలి అని ఆయన కోరుకున్నారు. తన శవం కాలేలోగా అది జరగాలి అని ఆయన మహేశ్ ని ఆఖరి కోరికగా కోరారట.. దాని కోసం మహేశ్ ప్లాన్ చేస్తున్నాడు అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కృష్ణ గారి మరణం ఒకవైపు బాధను కలిగిస్తున్నా.. మరొకవైపు ఎంతోమంది అనాధలను ఆదుకోవడానికి కృష్ణ గారు తీసుకున్న నిర్ణయం చూసి ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు.