Chiru: ఈ సంక్రాంతికి థియేటర్స్ దగ్గర ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. మరో వైపు నందమూరి నటసింహం బాలయ్య నటించిన వీర సింహారెడ్డి.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వార్ నెలకొంది.. ఇంతకీ ఈ రెండిట్లో ఏ సినిమాకు వెళ్ళాలనేది అనేది వీక్షకుల ప్రశ్న..
గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య పాత్ర గురించి ఎక్స్పెక్ట్ చేసినట్లే చూపించారు.. కానీ వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్స్ కంటెంట్ చాలా తక్కువ. సినిమా మొత్తం బాలకృష్ణనే కనిపిస్తాడు. కామెడీ అనేది పెద్దగా ఈ సినిమాలో లేదు. అదే వాల్తేరు వీరయ్య విషయానికి వస్తే మాత్రం ఫ్యాక్షనిజం, పవర్ ఫుల్ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ లేవు. సినిమా మొదటి నుంచి చివరి వరకు చిరంజీవి మాస్ పెర్ఫార్మెన్స్, రవితేజ పవర్ఫుల్ పర్ఫామెన్స్ శృతిహాసన్, కేథరిన్ రొమాన్స్ మరో హైలెట్. చిరంజీవి, శృతిహాసన్ మధ్య వచ్చిన లవ్ రొమాంటిక్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్ గా మారాయి. ఫైనల్ గా వాల్తేరు వీరయ్య కామెడీ కంటెంట్ ఎక్కువగా ఉందని జనాలు థియేటర్స్ కు వెళ్లి నవ్వుకోవచ్చని.. వీర సింహారెడ్డి సినిమా కోసం థియేటర్స్ కు వెళ్తే యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ చూసి ఎంజాయ్ చేయాలని.. ఈ రెండు సినిమాలో ఉన్న బిగ్ డిఫరెన్స్ ఇదే అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.