Breaking: బట్టతల ఉన్నవారిని మనం చూసే చూపులు వారిని మానసికంగా వేధిస్తాయి.. ఎంతో ఎన్నో రకాలుగా మాట్లాడే మాటలు వారి మనో ధైర్యాన్ని దెబ్బతీస్తాయి.. బట్టతల ఉన్న వారికి పెన్షన్ ఇవ్వాలని తాజాగా తెలంగాణలోని బట్టతల బాధితుల సంఘం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బట్టతల బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 6000 పెన్షన్ అందజేయాలని బట్టతల బాధితుల సంఘం మండల నూతన అధ్యక్షులు వెల్ది బాలయ్య ప్రభుత్వాన్ని కోరారు. గురువారం తంగాపల్లి రేణుక ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో బట్టతల బాధితుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. బట్టతల సంఘం మొదటి అధ్యక్షులుగా వెల్ది బాలయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా రాజేశం, కోసాధికారిగా మవుటం రాము, సభ్యులుగా పిల్లి నర్సయ్యలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టతల బాధితులకు 6000 పెన్షన్ ఇవ్వాలని కోరారు.. ఈ సమావేశంలో బట్టతల బాధితులు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నామని.. మానసిక వికలాంగుల కింద బట్టతల బాధితులకు సంక్రాంతి పండుగ సందర్భంగా.. పండుగలోపు పెన్షన్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో బట్టతల బాధితుల జిల్లా సంఘం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఉద్భవిస్తామని.. అలాగే ప్రతిభ భవన్ ముట్టడిస్తామని తెలిపారు.