Amrutha Pranay: కొన్ని సంవత్సరాల క్రితం మిర్యాలగూడలో పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. అగ్రకులానికి చెందిన అమృత అనే అమ్మాయిని ప్రణయ్ అనే దళితుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఒక్కగానీ ఒక్క కూతురు కావడంతో అమృత తండ్రి మారుతీ రావు ఉత్తర భారతదేశం నుండి కిరాయి రౌడీలను తీసుకువచ్చి ప్రణయ్ నీ అతికిరాతకంగా చంపించాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాక హైదరాబాద్ లో ఓ లాడ్జిలో మారుతీరావు ఉరేసుకుని చనిపోయాడు.
ఇదిలా ఉంటే భర్త ప్రణయ్ చనిపోయిన గాని అత్తగారి ఇంటి వద్ద ఉంటూ పుట్టిన పిల్లవాడిని చూసుకుంటున్నా అమృత ఇటీవల చాలా సంవత్సరాల తర్వాత తల్లిని కలవడం జరిగింది. ప్రణయ్ మరణించిన తర్వాత దాదాపు 5 సంవత్సరాలు పాటు పుట్టింటికి దూరమైన అమృత ఇటీవల…తల్లి గిరిజనీ కలవడం జరిగింది. దీంతో అమృత తల్లి కూతురిని దగ్గరకు తీసుకుని పుట్టిన మనవడిని కూడా ఆడించడం జరిగింది.
ఈ ఆనంద సందర్భాలను అమృత తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే అప్పట్లో మారుతీ రావు చనిపోయిన సమయంలో లేఖలో కూతురు అమృతనీ ఈ చివరి క్షణాలలో తల్లితో కలిసి ఉండమని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో చాలా సంవత్సరాల తర్వాత అమృత తల్లితో కలవటం పట్ల అమృత ఫాలోవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూనే మరో పక్క క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో ప్రణయ్ తల్లిదండ్రుల వద్ద ఉంటూ కొడుకుని చూసుకుంటూ సెకండ్ లైఫ్ కొనసాగిస్తూ ఉంది.