Allu Arjun: అల్లు అర్జున్ భీభత్సమైన ప్లాన్ – మహేష్ బాబు కి గట్టి దెబ్బ కొట్టబోతున్నాడు.!

Allu Arjun: ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా విడుదలై ఏడాది కావోస్తున్న ఆ సినిమా గురించి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. పుష్ప ఫీవర్ ఎక్కడా తగ్గడం లేదు. విదేశాల్లో కూడా ఇదే టాపిక్‌గా నడుస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. ఈ టాలీవుడ్ సినిమా తెలుగులోనే కాకుండా హిందీలో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప ది రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం బన్నీ తన అభిమానుల కోసం సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట..

Allu Arjun competing with Mahesh.
Allu Arjun competing with Mahesh.

పుష్ప 2 నుంచి బన్నీ లుక్ ను న్యూ లుక్ ను అభిమానులకు సంక్రాంతి సందర్భంగా రివీల్ చేయనున్నట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలు నిజమైతే.. సంక్రాంతికి పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు ఇది అదిరిపోయే ట్రీట్ అవ్వడం ఖాయం. అయితే సంక్రాంతికి మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రానుందని తెలుస్తోంది. త్రివిక్రమ్ బన్నీకి కు ఫోన్ చేసి సంక్రాంతికి నీ చిత్రం నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని అడిగితే లేదని చెప్పారట.. కానీ మహేష్ కి పోటీగా దిగడం కోసమే అల్లు అర్జున్ పుష్ప 2 నుంచి తన న్యూ లుక్ ను రివిల్ చేయబోతున్నాడని ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కచ్చితంగా అల్లు అర్జున్ మహేష్ బాబుని గట్టి దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసి రంగంలోకి దిగుతున్నట్లు టాక్.