Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం.. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ఇది. ఇందులో శకుంతల పాత్రలో సమంత… ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.. ఈ ట్రైలర్ చూసిన అక్కినేని ఫ్యామిలీ ఎలా రీయాక్ట్ అయ్యిందంటే..

శాకుంతలం ట్రైలర్ విజువల్ వండర్ గా చూపించారు.. సమంత ఒక వైపున అడవిలో శకుంతల ఆశ్రమవాసం .. మరో వైపున రాజ్యంలో దుష్యంతుడి రాజరికం. ఇద్దరి పరిచయం.. ప్రేమ.. వివాహం.. విరహం.. దుర్వాసుడి శాపం.. భరతుడి జననం వరకూ ఈ ట్రైలర్ లో చూపించేశారు. అద్భుతమైన విజువల్స్ తో కూడిన ఈ ట్రైలర్ ను అక్కినేని కుటుంబం కూడా చూశారట. ఈ ట్రైలర్ చూడగానే సమంత నాగార్జున , అమల మెచ్చుకున్నారట. సమంత మంచి పాత్ర ఎంచుకుంది. నిజంగా ఈ పాత్రలో అద్భుతంగా నటించింది అంటూ సుమంతులపై ప్రశంసల జల్లు కురిపించాడట నాగార్జున. అమల కూడా సమంత ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ సినిమాను డీల్ చేయడం నిజంగా గ్రేట్ అని అమల అన్నారట. ట్రైలర్ చాలా బాగుంది కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని వారు అన్నారని అక్కినేని కుటుంబంకి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం..