Health Benefits Of Maredu chettu: ప్రపంచంలో అతి పురాతనమైన సంస్కృతిలలో ఒకటి భారతీయ సంస్కృతి. ఈ క్రమంలో ప్రకృతికి భారతీయ సంస్కృతికి విడదీయరాని బంధం ఉందని చాలా శాస్త్రాలు పురాణాలు చెబుతాయి. పశువుల నైనా చెట్లను అయినా భారతీయులు తమ జీవితంలో భాగంగా చూస్తారు. చాలా శుభకార్యాలకు ఇళ్లకు తోరణాలు కట్టడం తో పాటు భోజనాలలో కూడా అరటి ఆకులు వాడుతుంటారు. ఈ రకంగానే భారతీయులు పవిత్రంగా రావి చెట్టు, వేప చెట్టు, మారేడు చెట్టు భావిస్తారు.
అయితే మారేడు చెట్టు బాగా పురాతన కాలంలో ప్రాచుర్యం ఉంది. ఈ చెట్టు అంటే పరమశివుడికి ఎంతో ప్రీతికరం. ఈ చెట్టు పవిత్రమైనదే కాదు.. ఎన్నో ఔషధ గుణాలు కలిగినది. ఈ చెట్టుకు సంబంధించి అన్నిటిని ఆయుర్వేదం వైద్యంలో వాడుతారు. ఈ చెట్టు ఖనిజాలు, విటమిన్లు కలిగి ఉంటుంది. ఇందులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, కెరోటిన్ అలాగే విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. మారేడు చెట్టు ఆకుల రసం షుగర్ వ్యాధి నిర్మూలనకు ఉపయోగిస్తారు. మారేడు పళ్ళు వాసన చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఈ పండుకి శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంది. మారేడు చెట్టు ఆకు కషాయం ద్వారానే రోగాలు కూడా నయమవుతాయి.
చర్మవ్యాధులను తగ్గించటంలో అదేవిధంగా క్యాన్సర్ కారకాలతో పోరాటంలో ముందుంటుంది. అదేవిధంగా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. మారేడు చెట్టు వేరు ఆయుర్వేదంలో అనేక రోగాలకు ఔషధంగా ఉపయోగిస్తారు. మారేడు ఆకుల రసం మధుమేహం ఉన్నవారు తీసుకోవడం వల్ల.. మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. మారేడు ఆకుల రసం ద్వారా పొట్టలలో అనేక ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. మారేడు చెట్టు మానవ ఆరోగ్యంలో అనేక రోగాలకు ఔషధంగా చాలావరకు మేజర్ రోల్ పోషిస్తుందని వైద్యులు కూడా చెబుతున్నారు.