Seethakka : తెలంగాణా అసెంబ్లీ సాక్షిగా సీతక్క vs KTR – కెసిఆర్ కూడా బిత్తరపోయిన సన్నివేశం !

Seethakka : తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. గ్రామపంచాయతీగా ఉన్న ములుగును మునిసిపాలిటీగా ప్రకటించినందుకు.. కేసీఆర్ కేటీఆర్ లతోపాటు మునిసిపల్ శాఖ , జిల్లా మాత్యులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. ములుగులో కలిపిన బండారు, జాంత్రావుపల్లి గ్రామీణ ప్రాంతాలను కలిపారు. ఈ పల్లె ప్రాంతాలలో కూడా డ్రైనేజీ రోడ్డులు వేయించాలని ఆమె అడిగారు. అలాగే స్వపక్షం విపక్షం అని తేడా లేకుండా జిల్లాను ఇచ్చినందుకు సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.

Mulugu MLA Seetha Akka vs KTR
Mulugu MLA Seetha Akka vs KTR

కలెక్టరేట్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. సీఎం గారు కాస్త చొరవ తీసుకొని చేయాలని కోరారు. అలాగే జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయం అందుబాటులో లేదని అది అది కూడా ఏర్పాటు చేయాలని కోరారు. మల్లంపల్లి ప్రాంత ప్రజలు ఆ ప్రాంతాన్ని మండలంగా మార్చాలని కోరుతున్నారు. ములుగు కి బస్టాండ్ నిర్మాణం చేయాలని.. ఉపాధి హామీ పథకం పట్టణంలో కూడా అమలు చేయాలని సీతక్క కోరారు.

ఇక స్పీకర్ మంత్రిగారి అయిన కేటీఆర్ ని మాట్లాడమని చెప్పగా.. అధ్యక్ష అనసూయ సీతక్క గారు మాట్లాడుతూ.. స్వపక్షం విపక్షం అనే పక్షపాత వైఖరి లేకుండా కొత్త జిల్లా ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని గుర్తించారు ధన్యవాదాలు అక్క.. కొత్త రాష్ట్రమే కాదు మొత్తం రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అనే ప్రాజెక్టు అక్కడ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న అనే వ్యత్యాసం లేకుండా మీరు కనీసం మీ జిల్లాకు ఇవ్వమని అడగలేదు. గౌరవ ఆరోగ్యశాఖ మంత్రి వారి నిర్ణయం తీసుకొని రెండు రెండు జిల్లాలలో ఒకటి నేను ప్రాతినిధ్య వహిస్తున్న సిరిసిల్లలో.. మరొకటి అభివృద్ధికి నోచుకోని ఆమడ దూరంలో ఉన్న ములుగు నియోజకవర్గంలో వెలుగులు నింపాలని ఈ ప్రాజెక్టును మీ జిల్లాలో కూడా అమలు చేసామని కేటీఆర్ గుర్తు చేశారు.

మరొక విషయం కూడా గుర్తు చేస్తున్న అక్క ములుగు ప్రాంతంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వమే అక్క అని కేటీఆర్.. మీరు అడగకపోయినా మేమే కేటాయించాం అక్క అని కేటీఆర్ గుర్తు చేశారు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కానీ మా అక్క అడగకపోయినా.. జిల్లా ఇచ్చి మెడికల్ కాలేజ్ ఇచ్చి మెడికల్ ప్రొఫైల్ ఇచ్చి మున్సిపాలిటీ ఇచ్చాం. ఇన్ని ఇచ్చినందుకు మీరు సహృదయంతో అభినందనలు తెలిపారు సంతోషం అక్క.. మీరు మా సబ్జెక్టుకి సంబంధం లేని ఇంకా కొన్ని విషయాలను అడిగారు. అవి మాకు సంబంధం లేకపోయినా.. నేను మాత్రం మీకు ఒక మాట ఇస్తున్నాను అక్క.. ఈ ప్రభుత్వం తరఫున ఏ పథకం వచ్చినా స్వపక్షం విపక్షం వారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అని వివక్షం లేకుండా అందిస్తామని కేటీఆర్ తెలిపారు. అలాగే ఆ బిల్లును కూడా పాస్ చేయమని స్పీకర్ ని కోరారు.