Jio best offers : రిలయన్స్ జియో సామాన్యులను కూడా దృష్టిలో పెట్టుకొని తక్కువ ధరకే అధిక బెనిఫిట్స్ అందించే రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఇక ఈ క్రమంలోనే అధిక డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందించే అత్యుత్తమమైన రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
Jio best offers : రూ.299 జియో ప్లాన్:
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా మీకు ప్రతిరోజు 2GB హై స్పీడ్ 4G డేటా లభిస్తుంది. 28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా మీకు 56GB డేటా వాడుకునే అవకాశం ఉంటుంది.అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. ఇక జియో క్లౌడ్, జియో సెక్యూరిటీ , జియో ఆప్స్ అన్నింటినీ కూడా ఉచితంగా సబ్ స్క్రిప్షన్ పొందవచ్చు.
రూ.333 జియో ప్లాన్:
ప్రతిరోజు 1.5 GB హై స్పీడ్ 4G డేటా పొందవచ్చు. 28 రోజులు వ్యాలిడిటీతో మొత్తం 42 జీబీ డేటాను మీరు ఈ ప్లాన్ ద్వారా పొందుతారు. ఇకపోతే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. ఇక జియో యాప్ లను అన్ని ఉపయోగించుకోవడమే కాకుండా రూ.149 విలువగల మూడు నెలల డిస్నీ + హాట్ స్టార్ ను మొబైల్లో ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందే అవకాశం కూడా ఉంటుంది.
రూ.499 రిలయన్స్ జియో ప్లాన్:
28 రోజులపాటు వ్యాలిడిటీని పొందవచ్చు. ఇక ప్రతిరోజు 2 GB డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటాను పొందుతారు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందే అవకాశం ఉంటుంది. రూ.499 విలువ గల ఒక ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ని కూడా ఉచితంగా పొందవచ్చు. జియో యాప్ లని కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.
రూ.666 రిలయన్స్ జియో ప్లాన్:
84 రోజులపాటు వ్యాలిడిటీ తో ప్రతిరోజు 1.5 GB డేటాను పొందవచ్చు . 84 రోజులకు 126 జీబీ డేటా పొందే అవకాశం ఉంటుంది. ఇక అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సౌకర్యం తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు అన్ని జియో యాప్ లను కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.