Smart TVs : ఇదే కదా ఫుల్ పైసా వసూల్ అంటే.. అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ లు..!!

Smart TVs : ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ దసరా సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక మీరు కూడా పండుగ సందర్భంగా కొత్త స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మీకు ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చింది ఫ్లిప్ కా. ముఖ్యంగా భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. అంతేకాదు ఇతర ఆఫర్లు కూడా సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించబడింది.. ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ లో భాగంగా స్మార్ట్ టీవీలపై కళ్ళు చెదిరే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మీకు నచ్చిన టీవీని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Advertisement

అంతేకాదు వీటిపై బ్యాంకు ఆఫర్లతో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్లు అలాగే ఇతర డిస్కౌంట్లను కూడా పొందే అవకాశం ఉంటుంది. కోకా స్మార్ట్ టీవీ కంపెనీకి చెందిన కోకా32 ఇంచెస్ హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ పై ప్రస్తుతం భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో ఈ టీవీ అసలు ధర రూ.36,990.. అయితే దీనిని దసరా సేల్ లో భాగంగా కేవలం రూ.7,999 కే కొనుగోలు చేయవచ్చు. అంటే ఏకంగా 78% తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు ఇతర ఆఫర్లు కూడా వర్తిస్తాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.500 తగ్గింపు తో రూ.7,499 కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement
Smart TVs at the cheapest price
Smart TVs at the cheapest price

అంతే కాదు ఈటీవీ కొనుగోలు చేసినప్పుడు 100 సూపర్ కాయిన్ లు కూడా లభిస్తాయి. 32 అంగుళాలు కలిగిన ఈ స్మార్ట్ టీవీ తో మీ పాత టీవీని ఎక్స్చేంజ్ చేసి కొనుగోలు చేస్తే ఆఫర్ కింద రూ.6000 వరకు తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ విలువ.. టీవీ మోడల్, కండిషన్ మరియు దాని ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టీవీ కండిషన్ బాగుంటే మీకు రూ. 6000 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాదు ఈ ఎమ్ ఐ ద్వారా టీవీ కొనుగోలు చేయాలనుకుంటే నెలకు రూ.719 నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 12 నెలలకు వర్తిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.1, 499 కే సొంతం చేసుకోవచ్చు.

Advertisement