Realme 9 5G SE : ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలుకానున్న నేపథ్యంలో ముందుగానే ఫ్లిప్ కార్ట్ కొన్ని రకాల ఉత్పత్తులపై భారీ ఆఫర్లను ప్రకటించే పనిలో ఉంది. సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించనుంది. ఇక 8 రోజులపాటు కొనసాగే ఈ సేల్ లో ల్యాప్ టాప్ ,స్మార్ట్ ఫోన్స్ , స్మార్ట్ వాచ్, యాక్ససరీస్ ఇలా ప్రతి ఒక్కదానిపై కూడా భారీ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవ్వకముందే రియల్ మీ 9 5G SE స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్కార్ట్ ఒక భారీ ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.24,999 మార్కెట్ ప్రైస్ కాగా ఫ్లిప్కార్ట్ లో 20% డిస్కౌంట్తో అంటే రూ. 5000 తగ్గింపుతో ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు కేవలం రూ.19,999 కే సొంతం చేసుకోవచ్చు.
ఇకపోతే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఆఫర్ ద్వారా ఇందులో అదనంగా 5 శాతం ఆఫర్ కూడా లభిస్తుంది. అంతేకాదు రియల్ మీ 9 5G SE స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.2,999 కే కొనుగోలు చేయవచ్చు. అది ఎలాగంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్ ను మీరు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక మీ పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేయడం వల్ల రూ.17000 తగ్గింపును పొందుతారు. అయితే ఈ ధర అనేది మీ పాత స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే, పనితీరు, బ్యాటరీ పై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా ఎలాంటి ఫిజికల్ డామేజ్ కూడా ఉండకూడదు. అన్నీ బాగున్నా పాత స్మార్ట్ ఫోన్ కి రూ.17,000 వస్తే అప్పుడు రియల్ మీ 9 5G SE స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.2,999కే కొనుగోలు చేయవచ్చు.
Realme 9 5G SE : ఫీచర్స్ Realme 9 5G SE
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే..6.6 అంగుళాల ఫుల్ హెచ్డి డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం పై పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే..48ఎంపీ ప్రధాన కెమెరా తో పాటు 2MP +2MP ప్రైమరీ కెమెరాలు అమర్చబడ్డాయి. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంది. 5000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ తో ఈ స్మార్ట్ ఫోన్ లభిస్తుంది.