Jio : జియో ద్వారా ప్రతిరోజు 3GB డేటా పొందాలి అంటే ఇక్కడ ఇవ్వబడిన రీఛార్జ్ ప్లాన్స్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. ఇక రిలయన్స్ జియో అందిస్తున్న డైలీ 3GB డేటా తో లభించే రీఛార్జ్ ప్లాన్స్ గురించి ఇప్పుడు చదివి తెలుసుకుందాం… రూ.4,199 రిలయన్స్ జియో ప్లాన్ : ఈ ప్లాన్ మీకు 365 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇక అంతేకాదు ప్రతిరోజు 3GB డేటా చొప్పున 1095 GB హై స్పీడ్ 4G డేటాను సంవత్సరం పాటూ పొందుతారు. ఇక ఏడాది పొడవునా ఏ నెట్వర్క్ కైనా సరే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను పొందుతారు. అంతేకాదు జియో యాప్ లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దీంతోపాటు ఒక సంవత్సరం రూ.1499 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ని పొందుతారు. ముఖ్యంగా ఓటీటీ లో అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్ ను మీరు ఉచితంగా చూడవచ్చు .
రూ.1,199 రిలయన్స్ జియో ప్లాన్ : ఈ ప్లాన్ మీకు 84 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. ఇక ప్రతిరోజు 3GB డేటా చొప్పున 252GB హై స్పీడ్ 4G డేటాను పొందుతారు. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ కూడా పొందుతారు. అంతేకాదు ఉచిత జియో యాప్ సబ్స్క్రిప్షన్ తో పాటు రూ.149 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. ముఖ్యంగా ఈ ప్లాన్ వర్క్ ఫ్రం హోం చేసుకునే వారికి చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.
రూ.601 రిలయన్స్ జియో ప్లాన్ : ఈ ప్లాన్ మీకు కేవలం 28 రోజులు వ్యాలిడిటీని అందిస్తుంది. ప్రతిరోజు 3GB డేటాతో కలిపి మొత్తం 28 రోజులకు గాను మొత్తం 90GB హై స్పీడ్ 4G డేటాను పొందుతారు. ఇకపోతే అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు జియో యాప్ లకు కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను అలాగే అదనంగా 6 జిబి డేటాను కూడా పొందుతారు.రూ.499 విలువైన ఒక సంవత్సరం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ ని కూడా పొందే అవకాశం ఉంటుంది.