Jio Offer : జియో బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ఉచిత ఓటిటి సబ్ స్క్రిప్షన్..! 

Jio Offer : తాజాగా జియో.. ఈ రీఛార్జ్ చేయండి.. ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ పొందండి అంటూ ఆఫర్లను అందిస్తోంది. గతంలో అనేక ప్లాన్స్ తో ఈ ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను ఆఫర్ చేసేది. కానీ నెట్వర్క్ 5G లాంచ్ అయిన తర్వాత కంపెనీ ఈ ఉచిత ఓటీటీ ఆఫర్ ను కేవలం కొన్ని ప్లాన్లకు మాత్రమే పరిమితం చేయడం గమనార్హం. ఇదే కాదు కొన్ని జనరల్ గా ప్రీపెయిడ్ ప్లాన్లను కూడా పూర్తిగా తొలగించడమే కాకుండా మరికొన్నింటిని సవరించింది. అయితే ఇప్పటికీ కూడా ఒక రెండు జియో ప్రీపెయిడ్ ప్లాన్ లతో మాత్రం ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ అందించడానికి సిద్ధమయ్యింది. మరి ఆ రెండు ప్లాన్స్ గురించి వీటి వల్ల ఎటువంటి ఓటీటీ యాప్స్ మనం ఉచితంగా సబ్ స్క్రిప్షన్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

Jio bumper offer.. if you do recharge..get OTT free subscription
Jio bumper offer.. if you do recharge..get OTT free subscription

రూ.1,499 జియో రీఛార్జ్ ప్లాన్:
జియో ఆఫర్ చేస్తున్న ప్లాన్లలో ఇది కూడా ఒకటి . ఈ ప్లాన్ తో మనకు అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తోంది . అంతేకాదు 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2GB హై స్పీడ్ డేటా చొప్పున 168 జిబి హై స్పీడ్ డేటాను పొందవచ్చు. అంతేకాదు ఈ ప్లాన్ డైలీ 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సిస్ ను తీసుకొస్తుంది.. ఇకపోతే ఇప్పటివరకు చెప్పిన ప్రయోజనాలన్నీ ఒక ఎత్తైతే మరొక అదనపు ప్రయోజనం కూడా మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే 1,499 రూపాయల విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒక సంవత్సరం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా పొందుతారు.

రూ.4,199 జియో రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తుంది. 365 రోజుల చెల్లుబాటుతో వచ్చే ఈ ప్లాన్ వ్యాలిడిటీ కాలానికి గాను మీకు మొత్తం 3 జిబి డైలీ డేటా చొప్పున 1095 GB హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ డైలీ 100 ఎస్ఎంఎస్లను కూడా అందిస్తుంది. మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సిస్ పొందవచ్చు. అదనంగా 1499 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యొక్క ఒక సంవత్సరం ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ని కూడా ఉచితంగా కస్టమర్లు పొందుతారు.