1Gb data Offers : ప్రముఖ ప్రభుత్వ నెట్వర్క్ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ అలాగే ప్రైవేటు సంస్థ అయిన జియో తమ కస్టమర్ల కోసం 1 జీబీ డేటాను ప్రతిరోజు అందించే కొన్ని రకాల ప్లాన్స్ తీసుకురావడం జరిగింది. ఇకపోతే జియో వన్ జీబీ డేటాతో 4Gహై స్పీడ్ డేటాను అందిస్తే బిఎస్ఎన్ఎల్ 1 జీబీ డేటాతో 3G స్పీడ్ డేటాను అందిస్తుంది. ఇకపోతే ప్రతిరోజు వన్ జీబీ ప్లాన్స్ కావాలని చూసేవారికి బిఎస్ఎన్ఎల్ అలాగే జియో రెండు కూడా కొన్ని రకాల రీఛార్జ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వాటి గురించి మనం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ నుంచి రోజు వారి వన్ జీబీ డేటా అందించే ప్లాన్లు చాలా ఉన్న వాటిల్లో అన్నిట్లో కల్లా సరసమైన ప్లాన్ రూ.184.. ఈ ప్లాన్ మీకు 28 రోజున పాటు వ్యాలిడిటీని అందిస్తుంది. 28 రోజుల పాటు రోజుకు 1GB డేటా చొప్పున మీరు ఎంజాయ్ చేయవచ్చు. ఇక డేటా ముగిసిన తర్వాత 84 కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు అలాగే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను కూడా పొందవచ్చు. ఇక బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ ద్వారా పాడ్ కాస్ట్ సేవలను కూడా యూజర్లు పొందుతారు.
ఇక జియో నుంచి వన్ జీబీ రోజు వారి డేటాను అందించే ప్లాన్ ధర రూ.209. ప్లాన్ మీకు 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంటుంది . అంతేకాదు ప్రతిరోజు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందవచ్చు. అలాగే జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ వంటి యాప్ లను ఉచితంగా యాక్సిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే వన్ జీబీ డేటా రోజులో ముగిసిన తర్వాత 64 కేబిపిఎస్ వేగంతో డేటాను ఉపయోగించుకోవచ్చు. రెండు కంపెనీలకు చెందిన రెండు ప్లాన్లను మీరు గమనిస్తే కేవలం 25 రూపాయలు మాత్రమే వ్యత్యాసం ఉంది.కానీ జియోతో మీరు ఖచ్చితమైన మెరుగైన ఫోర్ 4Gడేటా వేగాన్ని పొందుతారు. ఒకరకంగా చెప్పాలి అనుకుంటే జియో మీకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.