JIo 5G : టెక్ ప్రియులకు శుభవార్త.. హైదరాబాదులో జియో 5G..!

JIo 5G :  ఎట్టకేలకు టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కేవలం ఎంపిక చేసిన నగరాలలో మాత్రమే రిలయన్స్ తన 5G నెట్వర్క్ ను విస్తరించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తొలిసారి హైదరాబాదులో 5G నెట్వర్క్ ను ప్రారంభించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది రిలయన్స్ జియో. ప్రస్తుతం రిలయన్స్ జియో తమ వినియోగదారులకు శుభవార్త చెబుతూ హైదరాబాద్ బెంగళూరులోని ఎంపిక చేసిన వినియోగదారుల కోసం 5G నెట్వర్క్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Good news for tech lover's.. Jio 5G network in Hyderabad..!
Good news for tech lover’s.. Jio 5G network in Hyderabad..!

అయితే అదనపు ఖర్చు లేకుండా అపరిమిత డేటాను అందిస్తూ మరింతగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తన 5G నెట్వర్క్ ను విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాలలో దశలవారీగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. 5జి నెట్వర్క్ ను ప్రారంభించిన తొలినాళ్లల్లో ఢిల్లీ, కోల్కతా, వారణాసి, చెన్నై, నాథ్ ద్వారా, ముంబై వంటి ఆరు మహానగరాలలో బీటా ట్రయల్ నిర్వహించారు. ఇకపోతే ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాదుకు తమ సేవలను విస్తరించింది. కస్టమర్లకు మంచి ఎక్స్పీరియన్స్ అందించనున్నట్టుగా కూడా స్పష్టం చేశారు.

రిలయన్స్ జియో ఈ సంవత్సరం ఆగస్టులో నెట్వర్క్ కొనుగోలుకు సుమారుగా రూ. 88 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు తెలిపింది. 3300 MHz, 800 MHz, 700MHz, 26 GHz బ్యాండ్లను స్పెక్ట్రమ్ కొనుగోలు చేసింది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గా 5 G నీ ఉపయోగించే ఏకైక టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో మాత్రమేనని నిరూపితం చేసింది. అంతేకాదు ఎక్కువ వేగంతో ఎటువంటి అంతరాయాలు లేకుండా డేటాను అందిస్తోందని కూడా ప్రకటించింది. అంతేకాదు 5G క్యారియర్ అప్ గ్రేషన్ కి కూడా మద్దతు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇకపోతే జియో 5G సేవలను బెంగళూరు, హైదరాబాద్ లోని ఎంపిక చేసిన వినియోగదారులు వెల్కమ్ ఆఫర్ కి అర్హులు అని రిలయన్స్ జియో ప్రకటించింది. వారికి ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా గరిష్టంగా వన్ జీబీపీఎస్ వరకు అపరిమిత డేటాకు యాక్సిస్ లభిస్తుంది.