Jio offer : ఈ మధ్యకాలంలో థియేటర్ల కంటే ఓటీటీ ల హవా ఎక్కువైందని చెప్పవచ్చు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత చాలా సినిమాలు థియేటర్లో కంటే ఓటీటీ లోనే విడుదల చేసి మంచి ఆదాయాన్ని పొందుతున్నాయి.
ఇక అదే పద్ధతి ప్రస్తుతం కొనసాగుతూ వస్తోంది . ఇక నిర్మాతలు నష్టపోతున్నా.. థియేటర్లో యాజమాన్యం ఇబ్బంది పడుతున్నప్పటికీ.. చాలా సినిమాలు ఓటీటీ లలో విడుదలవుతూ రావడం గమనార్హం.
ఇకపోతే ఎన్నో అద్భుతమైన చిత్రాలను చూడాలి అంటే ఓటిటి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. రకరకాల మొత్తంలో ఖర్చు చేసి వాటిని సబ్స్క్రిప్షన్ పొందాలి. కానీ అలాంటి వారికి ఉచితంగా పలు రకాల ఓటీటీ యాప్ లను ఉచితంగా అందించడానికి జియో ముందడుగు వేసింది.ప్రస్తుతం జియో అందిస్తున్న ఈ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా మీరు ఉచితంగా నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రముఖ బ్రాండ్ ఓటిటి యాప్లను ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. ఇక అది ఎలాగో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
Jio offer : జియో అందిస్తున్న రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్
జియో అందిస్తున్న రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ మీకు నెల రెంటల్ ప్లాన్ గా రాబోతోంది. 75 జిబి హై స్పీడ్ 4G డేటాను పొందుతారు. ఏ నెట్వర్క్ కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ పొందుతారు. ఇక అంతే కాదు రోజువారి 200MB వరకు డేటాను రోల్ అవుట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇదే లాభాలను ఆఫర్ చేసే మరొక రెండు ఫ్యామిలీ ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్ ద్వారా మీకు అన్ని ఆఫర్స్ వర్తించడంతోపాటు సిమ్ కార్డు కూడా అదనంగా ఉచితంగా లభిస్తుంది.
రూ.599 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా మీరు ఒక సిమ్ కార్డును ఉచితంగా.. అది కూడా డోర్ డెలివరీ పొందవచ్చు. అలాగే రూ.799 విలువ గల పోస్ట్ పెయిడ్ ప్లాన్ తో రెండు సిమ్ కార్డులు లభిస్తాయి. ఇక ఈ ఆఫర్లను జియో కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీ యాప్ లను ఉచితంగా పొందాలనుకునే వారు ఈ రీఛార్జ్ తీసుకోవచ్చు.