Flipkart Big Billion Days Sale : ఫ్లిప్ కార్ట్ గత నెల సెప్టెంబర్ 23వ తేదీ నుంచి వరుసగా ఆఫర్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రకటించి ఎంతోమందికి తక్కువ ధరకే ఉత్పత్తులను అందించిన ఫ్లిప్ కార్ట్ ఆ తర్వాత దసరా సేల్ నిర్వహించింది. ఇప్పుడు మళ్లీ దీపావళి సేల్ నిర్వహిస్తోంది. ఇక ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసే వారికి ఏకంగా భారీ స్థాయిలో డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. ఊహించని విధంగా 60 శాతం డిస్కౌంట్ ప్రకటించి కస్టమర్లకు ఆదాయాన్ని పెంచింది అని చెప్పవచ్చు. అయితే ఈ ఆఫర్ కేవలం పరిమితి ఉన్నంత వరకే అని గుర్తుంచుకోవాలి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ప్రస్తుతం దీపావళి సేల్ నడుస్తోంది. అయితే ఈ సేల్ కేవలం అక్టోబర్ 16 వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఈ సేల్ సద్వినియోగం చేసుకొని తక్కువ ధరకే భారీ డిస్ప్లే కలిగిన టీవీలను సొంతం చేసుకోవచ్చు.
ఫ్లిప్కార్ట్ లో టిసిఎల్ కంపెనీకి చెందిన ఐ ఫాల్కన్ బ్రాండ్ టీవీల పై ప్రస్తుతం భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. 43 ఇంచుల అల్ట్రా హెచ్డి 4కె ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ పై సూపర్ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ టీవీ పై ఏకంగా 60 శాతం తగ్గింపు కూడా లభిస్తుంది. ఎంతలా అంటే రూ.50 వేల టీవీని మీరు కేవలం రూ.17 వేలకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు ఈ టీవీ ధర రూ.47,990 కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.18,999 కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎస్బిఐ బ్యాంక్, కోటక్ బ్యాంకు కార్డుల ద్వారా 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. అప్పుడు రూ.1,750 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.
అప్పుడు ఈటీవీని కేవలం రూ.17,249 కే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ పై నో కాస్ట్ ఈఎంఐ వంటి ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు నచ్చిన పద్ధతిలో స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇక ఇందులో ఫోర్ కె యు హెచ్ డి, HDR 10, 4K అప్ స్కేలింగ్, మైక్రో డిమ్మింగ్, ఏఐ వాయిస్ ఇంట్రడక్షన్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.