Flipkart Big Billion Days Sale : కస్టమర్లు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎట్టకేలకు ప్రారంభమైంది . నిన్నే ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈరోజు నుంచి ప్రతి ఒక్కరికి ఈ సేల్ అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు. ఇక సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్ కొనసాగుతుందని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇకపోతే ఇందులో భాగంగానే ఎన్నో వస్తువుల పై కళ్ళు చెదిరే ఆఫర్లను ప్రకటించడమే కాకుండా బ్రాండ్ ఉత్పత్తులపై కూడా భారీ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ఇకపోతే ప్రత్యేకించి ఆడవారికి ఉపయోగపడే ఎన్నో గృహాపకరణాలపై అలాగే బెడ్ రూమ్ వస్తువులపై కూడా 85% కళ్ళు చెదిరే డిస్కౌంట్ ను ప్రకటించింది.
ముఖ్యంగా బెడ్ రూమ్ ను అందంగా తీర్చిదిద్దే బెడ్ కవర్స్ సాధారణ ధర రూ.1199 వద్ద ఉండగా.. వీటిని 85% డిస్కౌంట్ తో కేవలం మీరు రూ.175 కే సొంతం చేసుకోవచ్చు.. ఇక అందమైన కాటన్ డబుల్ జైపూర్ బెడ్ షీట్లను ఇంత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఫ్లిప్కార్ట్. అంతేకాదు ఈ బెడ్ కవర్స్ తో మీ బెడ్ రూమ్ మరింత ఆకర్షణగా మారుతుందని చెప్పవచ్చు. ఇక రేమండ్ కంపెనీ నుంచి బాత్ టవల్స్ కూడా మీరు 66% డిస్కౌంట్తో సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.ఇక కాటన్ బాత్ టవల్స్ పై ఏకంగా 77% డిస్కౌంట్ ప్రకటించింది. అంతేకాదు రెండు ఉత్పత్తులను కొనుగోలు చేస్తే అదనంగా ఐదు శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది.
ఇక గృహపకరణాల విషయానికి వస్తే.. బటర్ఫ్లై రాపిడ్ ప్లస్ 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్ ను 61 శాతం డిస్కౌంట్తో సొంతం చేసుకోవచ్చు.. బజాజ్ మిక్సర్ గ్రైండర్ పై 49 శాతం డిస్కౌంట్ అలాగే హావెల్స్ మిక్సర్ గ్రైండర్ పై 43% డిస్కౌంట్ పొందే అవకాశం కల్పించబడింది. కేవలం మిక్సర్ గ్రైండర్లు మాత్రమే కాకుండా వంటింటికి ఉపయోగపడే ప్రతి వస్తువుపై కూడా సుమారుగా 50 శాతానికి పైగా డిస్కౌంట్ ప్రకటించి.. ఆడవారిని అట్రాక్ట్ చేయడమే లక్ష్యంగా ఎన్నో ఉత్పత్తులపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్కార్ట్ ఈ ఆఫర్ కేవలం నిర్ణీత సమయం వరకే ఉంటుంది కాబట్టి త్వరపడి అతి తక్కువ ధరకే మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి.