Android TV : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ బడ్జెట్ టీవీ ల తర్వాత ఇప్పుడు ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీలను తీసుకురాబోతోంది. ఇప్పుడు కంపెనీ టెలివిజన్ లో కొత్త లైన్ అప్ ను గ్లోబల్ మార్కెట్ లోకి విస్తరించే పనిలో ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇన్ఫినిక్స్ నుంచి 50 అంగుళాలు, 55 అంగుళాల క్యూ ఎల్ఈడి టీవీ తో సహా విభిన్న డిస్ప్లే సైజుల్లో జీరో సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీలో అద్భుతమైన క్వాంటం టెక్నాలజీని కూడా అందిస్తోంది . ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కుమార్ మార్కెట్లో కొత్త టెక్నాలజీతో కూడిన టీవీ లను తీసుకొచ్చినట్టు తాజాగా వెల్లడించారు.
Android TV : ఫ్లాగ్ షిప్ క్వాంటం టెక్నాలజీ
ఇకపోతే కంపెనీ టెలివిజన్ హిస్టరీ కలిగి ఉంది కాబట్టి అందులో భాగంగానే ఫ్లాగ్ షిప్ క్వాంటం టెక్నాలజీతో సరికొత్త 55 అంగుళాల క్యు ఎల్ఈడి 4కె టీవీ ని ప్రవేశపెట్టింది. ఇకపోతే రానున్న రోజుల్లో ఈ టెక్నాలజీ గేమ్ చేంజర్ గా అవతరించనుందట. ఇన్ఫినిక్స్ జీరో సీరీస్ అనేది మృదువైన డిస్ప్లే తో పాటు సేఫ్ వ్యూ ఎక్స్పీరియన్స్ తో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీ పవర్ఫుల్ ప్రాసెసర్ తో వచ్చింది. ఇక దీనికి గూగుల్ టీవీ సర్టిఫికెట్ కూడా ఉండడం గమనార్హం. ఇకపోతే ఇన్ఫినిక్స్ జీరో క్యు ఎల్ఈడి టీవీ సీరియల్స్ ని లాంచ్ చేయడం ద్వారా మిలియన్ల మంది కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్ అందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని అనిష్ కుమార్ వెల్లడించారు.
ఇన్ఫినిక్స్ అందించే జీరో సీరియస్ లోని జీరో 55 అంగుళాల క్యూ ఎల్ఈడి 4కె టీవీ ధర రూ. 34,990 వద్ద మనకు అందుబాటులో రానుంది. ఇక అదే 50 అంగుళాల 4k టీవీ ధర రూ.24,990 గా నిర్ణయించబడింది. ఇక ఈ రెండు ఆండ్రాయిడ్ టీవీలు సెప్టెంబర్ 24వ తేదీ నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. హెచ్డి ఆర్ టెన్ ప్లస్ సపోర్టు, డాల్బీ విజన్, 60 FPSMEMC సపోర్టుతో వస్తుంది. 8K నుంచి 20 K hz వరకు సౌండ్ క్వాలిటీని పెంచే రెండు ట్వీటర్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం కస్టమర్లను ఫీచర్స్ తోనే ఆకట్టుకుంటున్న ఈటీవీ త్వరలోనే వినోదాన్ని పెంచడానికి సిద్ధమవుతోంది.