Redmi 86 Inches Smart TV : తక్కువ ధరకే రెడ్మీ 86 ఇంచెస్ స్మార్ట్ టీవీ..ఫీచర్స్ అదుర్స్..!

Redmi 86 Inches Smart TV : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ టీవీలు దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మీరు కూడా మీ పాత టీవీని ఎక్స్చేంజ్ చేసి లేదా పాత టీవీ కి బదులుగా కొత్త టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లయితే మీకోసం ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చింది షావోమీ.. తాజాగా తన కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ టీవీ ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అది కూడా ఏకంగా 86 అంగుళాల స్మార్ట్ టీవీ ని ఆవిష్కరించి తక్కువ ధరకే కష్టమర్లకు అందించడానికి సిద్ధం అయ్యింది. చైనా దేశానికి చెందిన టెక్ కంపెనీ షావోమీ తాజాగా మార్కెట్లోకి షావోమి రెడ్మీ ఎక్స్ 86 పేరుతో కొత్త స్మార్ట్ టీవీ ని తీసుకొచ్చింది.

At low price you can get redmi 86 inches smart TV .. fantastic features..!
At low price you can get redmi 86 inches smart TV .. fantastic features..!

ఇది 4k టీవీ ఇంకా మెటల్ బాడీ డిజైన్తో మార్కెట్లోకి రాబోతుంది. MEMC మోషన్ కంపెన్షేషన్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో వన్ బిలియన్ కలర్స్..97 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఈ స్మార్ట్ టీవీ పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.. ఇక ఈ ఫోన్ పై రూ.50 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఉచితంగా రూ. 30 వేల స్మార్ట్ వాచ్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికి వస్తే.. USB 3.0, USB 2.0, HDMI 2.0, డ్యూయల్ బాండ్ వైఫై కనెక్టివిటీ వంటి ఫీచర్లు కలిగి ఉంది.. అదిరిపోయే వ్యూయింగ్ అనుభూతి పొందాలనుకునేవారికి ఈటీవీ అనువుగా ఉంటుంది. ఇంకా హై క్వాలిటీ ఆడియో కావాలనుకునే వారికి ఈ టీవీ లో అద్భుతమైన ఆప్షన్ ఇందులో రెండు.. రెండు చొప్పున 10 W స్పీకర్లు వుంటాయి.

ఈ టీవీలో షావోమి ఏఐ వాయిస్ కంట్రోల్ ఫీచర్ కూడా కలిగి ఉంది.2GB ర్యామ్, 16 GB మెమరీ స్టోరేజ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీ ఫ్రీ సేల్ నిర్వహిస్తోంది. ఈ టీవీ క్వాడ్ కోర్ A55 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ లపై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే చైనాలో ఉన్న కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరి త్వరలోనే ఇండియన్ మార్కెట్లోకి కూడా తీసుకొస్తామని ప్రకటించింది. నిజానికి ఈ స్మార్ట్ టీవీ అసలు ధర 5299 యువాన్లు.. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.60,308.. కానీ రూ.50,000 డిస్కౌంట్తో రూ.10 లోపే ఈటీవీ ని సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది.