Amazon : కొన్ని ప్రొడక్ట్స్ ని రిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ రిఫండ్ ఎందుకు ఇచ్చేస్తుంది.. ఆ లిస్టు ఇదే !

Amazon: ఒకప్పుడు మనం ఏదైనా వస్తువు కొనాలి అంటే నాలుగు షాపులు తిరిగి బేరం అడి కొనుకున్నే వాళ్లం.. ఒక్కోసారి మనకు వచ్చిన వస్తువు, డ్రెస్ ఏదైనా మనకు అందుబాటులో ఉండకపోవచ్చు.. ఉన్న దానితో అడ్జస్ట్ అవ్వక తప్పదు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండే మనకు నచ్చిన బ్రాండెడ్ కంపెనీల వస్తువులు, బట్టలు ఏవైనా సరే మన దగ్గరకే వస్తున్నాయి. అందుకు అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి పలు రకాల ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి..

amazon-refund-without-taking-items
amazon-refund-without-taking-items

అమెజాన్ లో చాలామంది తక్కువ రేటు వస్తువు నుంచి చాలా ఖరీదైన వస్తువులు వరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. కొనుగోలు దారులు కొనుగోలు చేసే చిన్న చిన్న వస్తువులను ఒకసారి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల గాని, డామేజ్ వల్ల గాని తిరిగి రిటర్న్ ఇచ్చేస్తారు. ఆ ప్రోడక్ట్ కు గాను అమెజాన్ షాపింగ్ వెబ్ సైట్ మన డబ్బులను మనకు తిరిగి రెండు మూడు రోజుల వ్యవధిలో రిఫండ్ చేస్తుంది.

ఇలా ఇచ్చిన వస్తువు సొమ్ము రిఫండ్ చేయడానికి అమెజాన్ సమస్థ ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తుంది. ఏంటంటే.. ఖరీదు తక్కువ గల వస్తువులను అమెజాన్ లక్షల ప్రొడక్ట్స్ ని రిటన్ తీసుకోకుండానే పడ వేస్తుంది. ఎందుకంటే ఆ వస్తువు కొన్న ధర అలాగే దానినీ కంపెనీకి తిరిగి పంపడానికి అయ్యే ఖర్చు కన్నా.. ఆ వస్తువును తిరిగి సెల్లర్ కి పంపించడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అందువల్లనే రిటన్ తీసుకున్న ప్రోడక్ట్ ని తిరిగి వ్యాపారికి పంపడం కన్నా పడవేయడం మంచిదని అమెజాన్ భావిస్తుంది. అందుకే కొన్ని సార్లు ఆ ప్రొడక్ట్స్ ను కస్టమర్స్ నుంచి తీసుకోకుండా వారి అమౌంట్ రీ ఫండ్ చేస్తుంది.