Smart TV : ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ఈ సేల్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఇకపోతే ఫ్లిప్ కార్ట్ ప్లస్ యూజర్ లకి మాత్రం ఈ సేల్ ఒకరోజు ముందుగానే వస్తుంది అని ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఇకపోతే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా పలు రకాల ఉత్పత్తులపై ఆఫర్లు కూడా సొంతం చేసుకోవచ్చు. ఇక ఇందులో భాగంగానే మీరు స్మార్ట్ టీవీలను కూడా అతి తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇకపోతే భారీ తగ్గింపు ధరలతో స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదనే చెప్పాలి.
మీరు కూడా ఒక కొత్త స్మార్ట్ టీవీ ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే 43 అంగుళాల స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఐ ఫాల్కన్ కు చెందిన 43 అంగుళాల స్మార్ట్ టీవీ ని కేవలం రూ.10,000 లోపే సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా ఈ స్మార్ట్ టీవీ మార్కెట్లో రూ.47,990 ధర పలుకుతోంది. ప్రస్తుతం డిస్కౌంట్ ఆఫర్ లో ఈ స్మార్ట్ టీవీ ని మీరు రూ.20,999 కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈటీవీపై ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ టీవీని కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది.

ఇక ఈటీవీ ని మీరు EMI కూడా నెలకు రూ.728 నుంచి ప్రారంభం అవుతుంది. ఇక అంతేకాదు ఐ ఫాల్కన్ స్మార్ట్ టీవీ పై మరో బంపర్ ఆఫర్ కూడా లభిస్తోంది. అదే ఎక్స్చేంజ్ ఆఫర్ ఈ టీవీ పై మీరు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ద్వారా రూ. 11,000 తగ్గింపుతో పొందవచ్చు. ఈ అన్ని ఆఫర్స్ ను పొందినట్లయితే మీరు ఐ ఫాల్కన్ 43 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని కేవలం రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇకపోతే ఎక్స్చేంజ్ అనేది మీ వద్ద ఉన్న టీవీ మోడల్, ప్రాతిపదికన టీవీ కండిషన్, మోడల్ ఆధారంగా ఎక్స్చేంజ్ విలువలో హెచ్చుతగ్గులు ఉంటాయి.