Roja : రోజాని మంత్రి అని కూడా చూడకుండా ఆ చానెల్ లో దారుణంగా అవమానించారు.. రగిలిపోతొన్న వైసీపీ ఫ్యాన్స్.!

Roja : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందినా వారిలో రోజా కూడా ఒకరు.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షో కు హోస్ట్ గా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు.. రోజా ఎమ్మెల్యే కావడానికి ఇప్పుడు మంత్రి కావడానికి ఒక విధంగా జబర్దస్త్ షోనే కారణమని రోజా భావిస్తారు.. మంత్రి పదవి పొందిన తర్వాత రోజా ఈ షోలకు దూరమైన సంగతి తెలిసిందే.. కాగా ఈటీవీలో దసరా పండుగ కానుకగా ప్రసారం కానున్న దసరా వైభవం షోకు గెస్ట్ గా హాజరయ్యారు.. అయితే ఈ స్పెషల్ షోలో రోజాకి ఘోర అవమానం జరిగింది..!!

Advertisement

శ్రీముఖి దసరా వైభవం షోకు గెస్ట్ గా రోజాను మంచి కిర్రాక్ సాంగ్ తో వెల్కమ్ చెప్తుంది… ఇక రోజాను హైపర్ ఆది రోజాను ఇంప్రెస్స్ చేయడానికి.. మీరు హీరోయిన్ అయ్యారని.. జడ్జ్ అయ్యారని.. ఎమ్మెల్యే అయ్యారని.. మంత్రి అయ్యారని మీలా ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలి అని అది అడగగా.. ఇలా కనిపించిన అమ్మాయిలు తిరగడం మానేయాలని రోజా అదిరిపోయే పంచ్ డైలాగ్ వేశారు.. ఈ షోలో ఇక్కడున్న మనోళ్ళలో ఎవరెవరికి ఏ శాఖ సెట్ అవుతుందో చెప్పమని రోజా అని అడగగా.. శ్రీముఖికి టూరిజం శాఖ సెట్ అవుతుందని.. అన్ని ఛానళ్లకు శ్రీముఖి టూర్ కొడుతుందని.. అందువల్లే ఆ శాఖకు ఆమె కరెక్ట్ అని రోజా చెప్పుకొచ్చారు.. ఆది నాకు ఏ శాఖ సెట్ అవుతుందని అడగగా.. ఆహార భద్రత శాఖకు నువ్వు కరెక్ట్ గా సూట్ అవుతావని రోజా చెప్పగానే.. శాంతి స్వరూప్ నాకు ఏ శాఖ ఇస్తారు అని అడగగా.. నీకు శాఖ కాదు పాక సెట్ అవుతుందని శాంతి స్వరూప్ పరువు తీసేసాడు హైపర్ ఆది..

Advertisement
ysr fans serious on that channel because of insulting roja
ysr fans serious on that channel because of insulting roja

నూకరాజు రోజాతో ఏదో చెప్పగా.. రోజా ఏం మాట్లాడుతున్నావ్ అంటూ సీరియస్ అవుతుంది.. ఈ ఈవెంట్ కు నన్ను పిలిచింది అవమానించడానికి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. మీరంతా ప్లాన్ చేసుకొని నన్ను రమ్మన్నారు అంటూ రోజా ఏడుస్తూ బయటకు వెళ్ళిపోతుంది.. దసరా పండగ రోజున ఉదయం 9 గంటలకు ఈవెంట్ ప్రసారం కానుండగా ఈ ప్రోమోకు మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి.. అయితే అసలు రోజా ను ఏడిపించడానికి గల కారణం ఏమిటి.. ఇదంతా ప్రోమో కోసం చేశారా.. లేదంటే నిజంగా రోజా ఏడ్చరా అని తెలియదు.. రోజా ఏడవటం మాత్రం వైసిపి అభిమానులకు కాస్త బాధగా ఉంది.. దాంతో ఈటీవీ పై వైసీపీ అభిమానులు కాస్త కోపంగానే ఉన్నారు.. అయితే ఇదంతా ప్రోమో క్లిక్ అవ్వడం కోసం అనే వాదన కూడా వినిపిస్తోంది.. రోజా బాధకి గల కారణం తెలియాలి అంతే దసరా రోజున ప్రసారం కానున్న ఈ ఈవెంట్ కోసం ఎదురు చూడక తప్పదు..

Advertisement