Ys Vivekananda Reddy : ఇది కదరా బిగ్ బ్రేకింగ్ అంటే : వై ఎస్ వివేకా కూతురు సునీత పొలిటికల్ ఎంట్రీ !!

Ys Vivekananda Reddy :  వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా ? ఆమెను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వటానికి రెండుపార్టీలు రెడీగా ఉన్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు, ప్రచారం చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తనింట్లోనే దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. టీడీపీ హయాంలో జరిగిన ఆ హత్యపై అప్పట్లో చంద్రబాబునాయుడు సిట్ తోవిచారణ చేయించారు.

Advertisement

2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సిట్ విచారణ కాదని సీఐడీతో విచారణ చేయించారు. సీఐడీ విచారణతో తన తండ్రి హత్య విషయంలో క్లారిటి రాదు కాబట్టి సీబీఐతో విచారణ చేయించాలని సునీత హైకోర్టులో కేసు వేశారు. విచారణలో భాగంగానే వివేకా హత్య విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించింది. అయితే సిట్, సీఐడీ, సీబీఐ ఏ సంస్ధ దర్యాప్తు చేసినా ఇంతవరకు లాజికల్ ఎండ్ అయితే రాలేదు. విచారణ ఇంకా సా—–గుతునే ఉంది.

Advertisement
YS Viveka's daughter Sunitha's political entry
YS Viveka’s daughter Sunitha’s political entry

ఈ నేపధ్యంలోనే తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న సునీత బాగా పాపులరయ్యారు. దాంతో డాక్టర్ కు టీడీపీ, జనసేనలు మద్దతుగా నిలిచాయి. ఎప్పుడైతే విషయం రాజకీయమైందో వెంటనే పార్టీలు సునీతను అప్రోచ్ అయినట్లు ప్రచారం మొదలైపోయింది. దాంతో వచ్చే ఎన్నికల్లో సునీత టీడీపీ తరపున పులివెందులలోనే పోటీచేస్తారనే ప్రచారం మొదలైంది. ఈమెకు టికెట్ ఇవ్వటానికి చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే ఇప్పటికే పులివెందులలో బీ టెక్ రవి పోటీచేస్తారని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు. కాబట్టి సునీత పులివెందులలో టీడీపీ తరపున పోటీచేసేది అనుమానమే అంటున్నారు. ఇదే సమయంలో జనసేన నుండి కూడా సునీతకు ఆహ్వానముందనే ప్రచారం జరుగుతోంది. మరి జరుగుతున్న ప్రచారం నిజమా కాదా అన్న విషయాన్ని సునీత మాత్రం చెప్పటంలేదు. బహుశా ఎన్నికల్లో దిగాలని అనుకుంటే ఆమె ఏ పార్టీ తరపున పోటీచేస్తారు అనేది ఆసక్తిగా మారింది.

Advertisement