YS Vivekanandareddy : అప్పట్లో ఏబీఎన్ ఛానల్ లో జగన్ గురించి వైయస్ వివేకానంద రెడ్డి చెప్పిన మాటలు..!!

YS Vivekanandareddy :  ఏబీఎన్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అప్పట్లో పాల్గొనడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ రాజీనామా చేశాక.. ఉప ఎన్నికలకు వెళ్ళిన సమయంలో వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో.. జగన్ గురించి వైయస్ వివేకానంద రెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో వైయస్ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ.. కొడుకుగా జగన్ అంటే తనకి బాబాయిగా నేనంటే వైయస్ జగన్ కి గౌరవమని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు వల్ల ఇద్దరి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది అన్నది వాస్తవం. కాంగ్రెస్ పార్టీ మా అన్న వైయస్ రాజశేఖర్ రెడ్డికి మంచి స్థానం కల్పించింది. ముఖ్యమంత్రి హోదాని ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో మా అన్న చేసిన కృషికి కాంగ్రెస్ అధిష్టానం తగిన గౌరవం కల్పించింది. అయితే మా అన్న చనిపోయిన అనంతరం వెంటనే ఆ హోదా దక్కలని అనుకోవడం అవివేకం. ఈ క్రమంలో కొద్దిగా వేరే పదవులలో ఉండి ఆ స్థాయికి చేరుకునే వరకు వేచి ఉండాలని అధిష్టానం చెప్పటంలో తప్పులేదు. అయితే ఈ లోపే వేరే పార్టీ పెట్టడం.. తనని కూడా ఆ పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం.. జరిగిందని అది తాను విభేదించినట్లు వైయస్ వివేకానంద రెడ్డి తెలిపారు.

Advertisement
ys vivekanandareddy old interview making sound on internet today and its about ys jagan
ys vivekanandareddy old interview making sound on internet today and its about ys jagan

ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరూ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో వాదోపవాదాలు కూడా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ కావాలని తన తండ్రి వైఎస్ఆర్ పేరు బదనం చేయాలని చూస్తున్నట్టు వైయస్ జగన్ భావించాడు. అయితే దానికి నేను ఏకీభవించలేదు. అన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కడప ప్రాంతంలో అనేక మంచి పనులు చేయడం జరిగింది. ఆ మంచి పనులను దృష్టిలో పెట్టుకొని ఇంకా మరిన్ని మంచి పనులు… మేమున్న ప్రాంతంలో చేయాలన్న ఉద్దేశంతో నేను కాంగ్రెస్ లోనే కొనసాగాలని డిసైడ్ అయ్యాను. ఈ నా నిర్ణయం.. అవతల వ్యక్తులకు నచ్చలేదు. అయితే మా ప్రాంతం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని అప్పట్లో మా బంధువుల పైన పోటీ చేయాల్సి వచ్చింది అంటూ వైయస్ వివేకానంద రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

ఈ వీడియో ఇప్పుడు వైరల్ ఆవుతోంది. అయితే ఈ ఉప ఎన్నికలలో వైఎస్ జగన్ రికార్డు స్థాయి మెజార్టీ రాబట్టడం తెలిసిందే. అనంతరం వైయస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టీలో వైఎస్ వివేకానంద రెడ్డి కీలక నేతగా రాణించడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన 2019 ఎన్నికలలో హత్య చేయబడటం ఇప్పుడు ఈ కేసు ఈనెల 30వ తారీకు లోపు విచారణ మొత్తం కంప్లీట్ కాబోతున్న తరుణంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. వైఎస్ అవినాష్ రెడ్డినీ CBI అనేకమార్లు విచారించడం జరిగింది.

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి

Advertisement