YS Viveka Case : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుది దశకు చేరుకోవడం తెలిసిందే. ఏప్రిల్ 30వ తారీకు లోపు విచారణ మొత్తం కంప్లీట్ చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి తెలియజేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో అరెస్టులు తప్పవని బయట గట్టిగా ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డినీ సిబిఐ మూడుసార్లు విచారణ చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో మొదటినుండి సొంత బాబాయ్ నీ చంపటం దారుణమని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఇంకా రెండు వారాలు మాత్రమే కేసు విచారణ ముగియనున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పైగా హత్య జరిగిన తర్వాత గూగుల్ టేక్ అవుట్ మ్యాప్… చూపించిన లొకేషన్ కీలకంగా మారటంతో ఓ ప్రముఖ నేత అరెస్టు అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కుట్ర కోణం ఉందని.. హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టు కూడా మొత్తం విచారణ క్షుణ్ణంగా చేయాలని సిబిఐ అధికారుకీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇదిలా ఉంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య 2019లో జరిగిన సమయంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కూతురు వైఎస్ సునీత పెట్టిన ప్రెస్ మీట్ సంచలనంగా మారింది. ఆ సమయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో హత్య ఎలా జరిగింది.. తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం వివరించడం జరిగింది. ఆ సమయంలో హత్య తామే చేసినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా వైయస్ సునీత భావోద్వేగానికి గురైంది. చనిపోయిన వ్యక్తి మా ఇంట్లో ఆయన…నిందలు కూడా మాపైన ఇది చాలా అన్యాయం అంటూ వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.