ABN RK : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని కమ్మేసిన కష్టాలు ఇరువురిని కలవరపెడుతున్న ఈడి సిబిఐ దూకుడు.. ఎండలు మొదలకముందే జగన్ కేసీఆర్ ఉక్కపోతకు గురవుతున్నారు.. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డిని అతని తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి.. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు కవితలు అరెస్టు చేయడానికి ఈడీ సిద్దంగా ఉంది.వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టుకు రంగం సిద్ధం.. హత్య కేసుతో లిక్కర్ స్కాముకు వదిలేసిన ఢిల్లీ పెద్దలు కేసీఆర్ బిడ్డతో పాటే అవినాష్ ఆట కట్టించాలని వ్యూహం.. చెల్లి కవితకు సంఘీభావంగా ఢిల్లీ చేరుకున్న కేటీఆర్.. వివేకా కేసులో సోదరీ సునీతను ఇరికిస్తున్న జగనన్న..
సిబిఐ గూగుల్ టేక్ అవుట్ వాడకంతో జగన్ రెడ్డి పరేషాన్.. ఇప్పటివరకు చెప్పిన కట్టుకథలు నిలవని ఆందోళన.ఈ రెండు పరిమాణాలు ఇద్దరు ముఖ్యమంత్రులకు రాజకీయంగా ఎంతో కొంత నష్టం చేస్తాయి. దీంతో అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలకు తెర తీశారు. వివేక కేసులో అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు చేసిన అవి ఫలించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తనకున్న అనుబంధం వల్ల ఈ కేసు నుంచి అవినాష్ కుటుంబాన్ని తప్పించవచ్చని జగన్ ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు తాత్సారం చేస్తూ వచ్చిన సిబిఐ ఇప్పుడు వేగం పెంచింది.
ఈ పరిణామంతో కంగుతిన్న జగన్ అండ్ కో.. ఇదంతా చేయించింది ఆయన ఏకైక కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఆమె భర్త రమేష్ రెడ్డి. వాస్తవానికి వివేకా కేసులో అవినాష్ రెడ్డి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పీకల వరకు ఇరుక్కుపోయారు. ఇప్పుడు కవితపై చర్యలు తీసుకోవాలంటే అవినాష్ రెడ్డిని కూడా అరెస్టు చేయక తప్పని పరిస్థితి.. మొత్తానికి ఇద్దరు ముఖ్యమంత్రులు సంకటంలో ఇరుక్కుపోయారు.