YS Avinash Reddy – YS Sunitha : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తుది దశకు చేరుకుంది. అయితే ఈ హత్య కేసు విషయంలో మరోసారి విచారణకు హాజరు కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం నిన్న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ క్రమంలో వైయస్ వివేక కూతురు వైయస్ సునీత.. న్యాయవాదులు అవినాష్ రెడ్డి పాత్ర విషయంలో… కోర్టులో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టుకి తరలించడానికి పలుకుబడి ఉపయోగించారని కుట్రకోణం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య చేయబడ్డాక గుండెపోటుతో మరణించాడు అని మొట్టమొదటిసారిగా ప్రకటించింది అవినాష్ రెడ్డి అని సునీత రెడ్డి లాయర్లు న్యాయస్థానంలో తెలియజేశారు.
అయితే ఎప్పుడు నోటీసు ఇచ్చిన అరెస్టు చేయొద్దని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాడు. గూగుల్ టేక్ అవుట్ సాక్షాలు సరిపోతాయా లేదా అనేది త్వరలో తేలనుంది. విచారణ ఈ దశలో ఉన్నప్పుడు నిందితుడు తేల్చేది కాదు. ఆ విషయాన్ని సరైన సమయంలో కోర్టులు తేలుస్తాయి. విచారణను అడ్డుకోవటానికి అవినాష్ ప్రతిసారి కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సునీత వైఎస్ వివేకానంద రెడ్డికి కన్న కూతురు వారి మధ్య విభేదాలు లేవు. మరోవైపు వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడిన అనంతరం అవినాష్ రెడ్డి స్పాట్ కి వెళ్లి గుండెపోటు అని ధ్రువీకరించినట్లు సిబిఐ వాదనలు వినిపించడం జరిగింది.
ఈ క్రమంలో ఇప్పటివరకు నాలుగు సార్లు అవినాష్ ని విచారించినట్లు సిబిఐ తెలంగాణ హైకోర్టుకి తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే రేపటి నుంచి 25 వరకు విచారణకు హాజరు కావాలని తాజాగా తెలంగాణ హైకోర్టు.. బెయిల్ పిటిషన్ పై స్పష్టం చేయడం జరిగింది. సీబీఐ విచారణ మొత్తం ఆడియో వీడియో రికార్డు చేయాలని కోరడం జరిగింది. ఈనెల 25 వరకు అరెస్టు చేయకూడదని సిబిఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అవినాష్ రెడ్డికి ఉరట కలిగించినట్లు అయింది.