YS Viveka Case : మాజీమంత్రి దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును లోతుగా విచారిస్తున్న సిబిఐ ఇప్పుడు మరొకసారి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు పంపింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ లోని కోటీ లో ఉన్న సిబిఐ ఆఫీస్ లో జరిగే విచారణకు రావాలి అని అందులో కోరింది. అయితే అవినాష్ రెడ్డిని సిబిఐ విచారణకు పిలవడం ఇదే మొదటిసారి కాదు ఇది ఐదవ సారి.. అయితే ఈసారి అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు ఇందుకు కొన్ని కారణాలను కూడా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు.

నిన్న అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు. ఆయన నుంచి సేకరించిన సమాచారంతో ఇవాళ అవినాష్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తారని సమాచారం. ఆయన్ని కూడా అరెస్టు చేస్తారని సిబిఐ దూకుడు చూస్తుంటే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని పలువురు చెబుతున్నారు. ఇకపోతే నిన్న పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి సుమారుగా పదిమంది సిబిఐ అధికారులు వెళ్లారు అక్కడే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు ఉస్మానియా ఆసుపత్రిలో పరీక్షలు జరిపించి జడ్జి ముందు హాజరు పరిచారు. జడ్జి ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను చంచల్గూడా జైలుకు తరలించారు ఇవాళ ఆయనను కష్టడి కోరే అవకాశం ఉంది.
అటువైపు ఆయన తరుపు లాయర్లు బెయిల్ కోసం పిటిషన్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కేసు దర్యాప్తులో ఈనెల 30లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కోరడంతో.. సిబిఐ వేగంగా దర్యాప్తు చేస్తోంది అందువల్లే భాస్కర్ రెడ్డిని కస్టడీకి అవకాశాలు కనిపిస్తున్నాయి.