YS Sunitha : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. ఏప్రిల్ 30వ తారీకు కేసు విచారణ మొత్తం పూర్తికానుంది. ఈ క్రమంలో నేడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డినీ సీబీఐ అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. వివేక హత్య కేసులో భాస్కర రెడ్డి హాత్యాసాక్షాలు జరిపేయటంలో పాత్ర ఉందని అభియోగాలు మోపింది. వివేక గుండెపోటుతో మరణించినట్లు భాస్కర రెడ్డి ప్రచారం చేశారని పేర్కొంది. హత్యకు ముందు తర్వాత నిందితులతో తన ఇంట్లో సమావేశమైనట్లు గూగుల్ టేకౌట్ ద్వారా గుర్తించినట్లు సిబిఐ స్పష్టం చేసింది. మరోపక్క తన తండ్రిని సిబిఐ అరెస్టు చేయడంతో హైదరాబాదు నుండి పులివెందుల చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ హత్య కేసులో తాము చెప్పిన విషయంపై సీబీఐ విచారణ జరపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని ఊహించని విధంగా అరెస్టు చేశారని..సీబీఐ ఈ స్థాయికి దిగజారటం ఎంతవరకు సమంజసం అని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లేకపోయి ఎందుకు విచారణ చేయడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో అరస్ట్ చేయాల్సింది వాడిని కాదు .. అసలు వాడిని వదిలేస్తారా నిప్పులు గక్కుతూ వైఎస్ సునీత ప్రెస్ మీట్ పెట్టీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అని టాక్. ఇక ఈ విషయంలో మొదటి నుండి వైయస్ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. పైగా మూడుసార్లు సిబిఐ విచారణ చేయడం జరిగింది.
దీంతో ఏ క్షణమైనా వైయస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ప్రజెంట్ ఏపీ రాజకీయాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కేసుకుది విచారణ అయ్యేలోపు మరిన్ని అరెస్ట్ లు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. నేడు పులివెందులలో భాస్కర రెడ్డిని అరెస్టు చేయగా.. ఉస్మానియాలో సీబీఐ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత జడ్జి ముందు హాజరు పరిచారు. దీంతో జడ్జ్ రెమ్యాండ్ విధించగా..సీబీఐ అధికారులు ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించడం జరిగింది.