YS Sunitha :బ్రేకింగ్: వైయస్ సునీత బాలకృష్ణ ను కలవనుందా.?

YS Sunitha :వైయస్ వివేకానంద రెడ్డి ఆడపిల్ల కాదు.. ఆడ పులినీ కన్నారని వైఎస్ సునీత గురించి జనం అందరిలో ఉన్న మాట. వైఎస్ వివేక ప్రాణాలు తీసిన కేసులో ఆమె పట్టుదల చూసి జనం మాట్లాడిన మాట.. వైయస్ వివేకా కేసు లో దోషుల్ని కోర్టు మెట్లు ఎక్కించేందుకు ఆమె ఎన్ని పాట్లు పడ్డారో మనందరికీ తెలుసు.. వేరొక రాష్ట్ర ప్రభుత్వం లోనే వివేకా కేసు విచారణ జరిపించాలని సునీత పట్టుబట్టారు. ఆమె అనుకున్నది జరగడం కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మొత్తానికి సునీత కష్టం ఫలించింది. సిబిఐ విచారణ జరిపి ఈ కేసును ఓ కొలిక్కి వచ్చింది.

తండ్రి కేసులో అనుమానితులందరూ దగ్గర వాళ్లు అనుచరులే. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లేదు. కోర్టు, కేసులు తెలియవు. అప్పటివరకు డాక్టర్ వృత్తికి పరిమితమై ఉంది. కానీ కాలం ఆమెని రాటు తేల్చింది. కష్టాలు ఆమెను కఠినంగా మార్చేశాయి. పులివెందుల రాజకీయాలకు సునీత ముందు నుంచి దూరంగా ఉన్నారు హైదరాబాదులో వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డి పెద్దనాన్న రాజశేఖర్ రెడ్డి కి అండగా పులివెందులలో రాజకీయం నడిపారు.

సునీతను ఎప్పుడూ రాజకీయంగా ప్రోత్సహించలేదు ఆమె కూడా ఆసక్తి చూపలేదు. కానీ వైయస్ వివేక కేసు తర్వాత ఆమెకు రాజకీయ కుట్రలు చుట్టుముత్తాయి. తండ్రిని బాధ చేసిన హంతకుల అంతు తేల్చడానికి ఆమె కంకణం కట్టుకుంటే ఆమె సొంతవారే ఆమెను నిర్వీర్యంగా చేసే ప్రయత్నాలు కూడా కొన్ని జరిగాయని గతంలో వార్తలు వినిపించాయి. భర్తని కూడా ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు చేశారు. అందుకే అనుమానితుల జాబితాలో ఆమె కొందరి పేర్లను తెలిపింది. దాంతో హంతకులకు భయం మొదలైంది సునీతను నయానా భయానా లొంగ తీసుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి .కానీ సునీత ఏమాత్రం లొంగలేదు. డబ్బు ఎమ్మెల్యే పదవిని ఆశ చూపిన కానీ వాటిని ఎడమ కాలితో తన్నింది. తనకి రాజకీయాలు అవసరం లేదని తన తండ్రిని చంపింది ఎవరో అందరికీ తెలియాలని అందరి ముందు ప్రకటించింది. అండగా ఉండాల్సిన వాళ్లే ఆమెపై బురదజల్లే ప్రయత్నాలు చేశారు. ఏపీలో న్యాయం జరగడం లేదని సుప్రీంకోర్టుకు వెళ్ళింది.

ఇదిలా ఉంటే సునీత బాలయ్య ను కలవాలని అనుకుంటుందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. సునీత రెడ్డి ఇప్పుడు బాలకృష్ణను ఎందుకు కలవాలని అనుకుంటుంది అనేదానిపైన అనేక అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అయితే సునీతకు నందమూరి బాలకృష్ణ తన వంతు మద్దతు అందించారట. ఈ కేసు విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్తున్నారా.. లేదంటే మరింకేమైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది..