BREAKING: వై ఎస్ షర్మిల కి ఏమైంది.!? 

దివంగత సీఎం వైఎస్ఆర్ కుమార్తె షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ని ఏర్పాటు చేశారు.. అయితే షర్మిల పార్టీని అక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదు.. ఒకవైపు టిఆర్ఎస్ మరోవైపు కాంగ్రెస్ అక్కడ అత్యంత బలంగా ఉన్నాయి.. దానికి తోడు బిజెపి కూడా అడపాదడపా నేనున్నానంటూ తన ఉనికిని చాటుకుంటుంది.. అంతేకాకుండా కొన్ని చిన్నచితిగా పార్టీలు ఉన్నాయి.. దాంతో ఎవ్వరూ వైయస్ షర్మిల అని పట్టించుకోవడం లేదు.. తను కూడా ఈమధ్య కొన్ని చోట్ల అస్సలు కనిపించటం లేదు..

రాజన్న రాజ్యం తెస్తానంటు తెలంగాణలో కాలికి బలం పట్టుకుని షర్మిల పాదయాత్ర చేస్తున్న.. ఇన్ని పార్టీల మధ్య ఆమెను ఎవరు పట్టించుకోకపోవడంతో పాటు పలు విమర్శలు వస్తున్నాయి.. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చడానికి.. అక్కడ పట్టిని బలపడనీయకుండా చేయాలని షర్మిల కొత్త పార్టీ అవతారం ఎత్తిందని పలువురు విమర్శిస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గాన్ని చీల్చడం బిజెపి ప్లాన్ షర్మిల బీజేపీతో కలిసి డ్రామా ఆడుతున్నారని.. షర్మిల బీజేపీ వాళ్లు ఇద్దరు కలిసి పోవడానికి ఇది ఒక రకమైన ప్లాన్ అని మరి కొంతమంది అంటున్నారు.. వైయస్ జగన్ షర్మిల మధ్య అభిప్రాయాలు భేదాలు పచ్చి అబద్ధమని సీనియర్ జర్నలిస్టులు సైతం చెబుతున్నారు. తెలంగాణలో బిజెపి లేదా టిఆర్ఎస్ కు మేలు చేయడం కోసం షర్మిల పార్టీ ఉందని వారు ఆరోపిస్తున్నారు..

 

టిఆర్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర విమర్శలు చేసే షర్మిల బీజేపీ మీద ఒక్క విమర్శ కూడా చేయకపోవడం కూడా గమనించాల్సిన విషయం బిజెపి తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో పోటీ చేస్తున్నారు ఆయన తన తండ్రికి అత్యంత సన్నిహితులు కావడం వల్లే షర్మిల మునుగోడు గురించి ఆలోచించడం లేదని చెబుతున్నారు ఇలా షర్మిల పార్టీకి తెలంగాణలో పక్కా లెక్కలు ఉన్నాయని ఆ లెక్కల ప్రకారమే ఆమె వ్యవహార శైలి ఉంటుందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ముందు ముందు షర్మిల పరిస్థితి యూట్యూబ్ స్టార్ కంటే ఎక్కువ క్రేజ్ పొందలేదని.. సాదాసీదా మహిళగా మిగిలిపోతుందని మరికొంతమంది అంటున్నారు..

Advertisement