YS Jagan : ఇవాళ జరగబోయే ఆ సమావేశంలో వాళ్ళందరి తలరాతలూ మార్చబోతోన్న వైఎస్ జగన్ !

YS Jagan : మంత్రులు, ఎంఎల్ఏల్లో టెన్షన్ మొదలైంది. ఈరోజు సాయంత్రం జరగబోయే సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అనేక విషయాలను మదింపు వేయబోతున్నట్లు సమాచారం. తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం అమలు తీరుతో పాటు మంత్రులు, ఎంఎల్ఏల వ్యక్తిగత గ్రాఫ్ ను కూడా జగన్ చర్చించబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అనేక విషయాలపై జగన్ అవసరమైన సర్వే రిపోర్టును తెప్పించుకున్నారు.

ప్రభుత్వం అమలుచేస్తున్న కార్యక్రమాలతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీల పనితీరుపైన కూడా జగన్ సర్వేలు చేయించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు మళ్ళీ టికెట్లు దక్కాలంటే తానుచేయించుకుంటున్న సర్వేల్లో మంచి రిజల్టు రావాల్సిందే అని ఇప్పటికే జగన్ స్పష్టంగా చెప్పేశారు. ఎవరికైనా టికెట్ దక్కకపోతే అందులో తన తప్పేమీ లేదని కూడా అందరిముందే ఎలాంటి మొహమాటం లేకుండా తేల్చేశారు.

YS Jagan is going to change all their heads in the meeting that will be held today
YS Jagan is going to change all their heads in the meeting that will be held today

దానికి అనుగుణంగానే సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. ఈరోజు జరగాల్సిన మీటింగ్ ఇంతకుముందే జరగాల్సింది. వివిధ కారణాల వల్ల రెండుసార్లు వాయిదాపడి బుధవారం జరగబోతోంది. తిరుమల నుండి మధ్యాహ్నానికి జగన్ నంద్యాల చేరుకుంటారు. అక్కడ రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించిన తర్వాత అక్కడనుండి డైరెక్టుగా తాడేపల్లికి చేరుకుంటారు. ఇప్పటికే వివిధ రూపాల్లో తెప్పించుకున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా కొందరు మంత్రులు, ఎంఎల్ఏలపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

YS Jagan is going to change all their heads in the meeting that will be held today

జగన్ ఆగ్రహం దెబ్బకు చాలామంది పద్దతి మార్చుకుని జనాల్లో తిరుగుతున్నా ఇంకా కొందరు మాత్రం దారిలోకి రాలేదని సమాచారం. అలాంటి వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో జగన్ కు బాగా తెలుసు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఎలాంటి మొహమాటాలకు తావుండదని అందరికీ అనుభవంలోకి వచ్చింది. కాబట్టి కొందరికి పనితీరు ఆధారంగా టికెట్లు ఇవ్వకూడదని అనుకుంటే ఇక ఇవ్వరంతే. అందుకనే ఎవరి జాతకం ఎలాగుందో ఎవరిమీద జగన్ ఆగ్రహం వ్యక్తంచేస్తారో తెలీక అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. సర్వేల దెబ్బకు ఎవరి తలరాతలు మారిపోతున్నాయో చూడాల్సిందే.