Ys Jagan-Apparao : బ్రేకింగ్ : ఆ నియోజికవర్గం నుంచి వైసీపీ తరఫున జబర్దస్త్ అప్పారావు కి టికెట్ ఖరారు చేసిన జగన్.?

Ys Jagan-Apparao : జబర్దస్త్ ఫేమస్ కమెడియన్, సీనియర్ నటుడు అప్పారావు తాజాగా జగన్ సర్కార్ కి జై కొట్టారు.. ఈ నెల 15న విశాఖ గర్జనకు నేను కూడా వస్తున్నానంటూ మద్దతు తెలిపారు.. మన విశాఖ మన రాజధాని పేరిట విశాఖ రాజధాని చేయాలని కోరుతున్నానని.. ఈ మహా యజ్ఞంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు.. తాను కూడా ఈ నెల 15న విశాఖకు వస్తున్నానని అందరూ రాజధానికి మద్దతు ఇవ్వాలని ఆయన తెలిపారు..

Ys Jagan-Apparao Jagan finalized the ticket for Jabardast Apparao on behalf of YCP from that constituency.
Ys Jagan-Apparao Jagan finalized the ticket for Jabardast Apparao on behalf of YCP from that constituency.

జబర్దస్త్ అప్పారావు గారు సొంత ఊరు విశాఖ జిల్లాలోని అక్కయ్యపాలెం గ్రామం ఆయన భార్య ఒక టీచర్.. ఆయనకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఎంతో ఇష్టం ఉండడంతో ఆయన సినిమాలపై, నాటకాలపై ఆసక్తి చూపారు.. ఇప్పటివరకు ఆయన 250 పైగా సినిమాలు 71 పైగా సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందారు.. శుభవేళ అనే సినిమాతో వెండితెరకు ఆయన పరిచయమయ్యారు.. ఆ తరువాత ఎన్నో షోస్ చేసినప్పటికీ.. జబర్దస్త్ షో తో మంచి ఫ్యాన్ ని పేరును సంపాదించుకున్నారు.. అంతేకాకుండా అప్పుడప్పుడు ఆయన విశాఖ ప్రాంతంలో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు..

కరోనా సమయంలో ఆయన వంతుగా కరోనా పై ప్రజలు ఎంతో జాగ్రత్త తీసుకోవాలని మాస్కులు ధరించాలని “మద్దిలపాలెం” కూడలి దగ్గర అప్పారావు గారు మాస్కులు పంపిణీ చేశారు.. కరోనా పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.. అలాగే మద్దిలపాలెం కళాకారుల ఆధ్వర్యంలో తెలుగు తల్లి విగ్రహం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ వాసిగా తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. జగన్ ప్రభుత్వానికి అప్పారావుకి సంబంధమేమి వీడియో వైరల్ అవుతుంది..

అయితే అప్పారావు ఈ వీడియో చేయడం అనగా ఓ బలమైన కారణం ఉందట.. జబర్దస్త్ కమెడియన్ అప్పారావుకు వైసిపి ఎమ్మెల్యేగా టికెట్ ఖరారు అయినట్టు సమాచారం.. అందుకు వైసీపీ తరఫున వైజాగ్ నియోజక వర్గానికి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పజెప్పాలని జగన్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారట.. అప్పారావుకి వైసీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఖరారు అయింది కాబట్టే.. ఇంత చురుగ్గా వైసీపీ తరుపున విశాఖ గర్జనలో పాల్గొన్నారని వైసిపి శ్రేణులలో గుసగుసలు వినిపిస్తున్నాయి..