Raghurama krishnam Raju : ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎక్కడ ఏ జిల్లా ఎలా ఉన్నా.. పార్టీ అధినేత, సీఎం జగన్ సొంత జిల్లా కడప మాత్రం కంచు కోట.. ఇక్కడ వైసీపీకి ఎదురులేదనే పరిస్థితి ఉంది. 2019లో ఎన్నికల్లో రెండు ఎంపీ స్తానాలు (కడప, రాజంపేట) సహా 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ విజయ భేరి మోగించింది.. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కడపలో వైసీపీ అభ్యర్థులకు రెండు చోట్ల కూడా వారికి ఎదురుగాలి వీచింది. దాంతో కడపలో వైసీపీ పునాదులు కదులుతున్నాయా? జగన్ ని కడప తరిమి కొట్టిందా అంటూ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు సానుభూతి వ్యాఖ్యలు చేశారు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటరు మూడ్ ను తెలిపాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈఎన్నికల్లో కడప జిల్లాలో 58,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఓటింగ్ పరిశీలిస్తే.. డబ్బు పంచి, అధికార బలం ఉపయోగించినా.. ప్రస్తుత పరిస్థితిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిని మరచి నవరత్నాలు నమ్ముకున్నామని..
కేవలం బటన్ నొక్కడం వల్ల మా వెంటే ఉన్నారనుకున్నామనే భ్రమలో ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటరు తీరుతో జనం నాడి అర్థమవుతోందని… డేంజర్ బెల్స్ మోగినట్లేనని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రధానంగా సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఇలా జరగడం పట్ల నాయకులు ఏమీ మాట్లాడలేని పరిస్తితి రావడం గమనార్హం.
జగన్ ఇలాకా పులివెందుల లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం పరాజయం పాలయ్యింది. దాంతో రఘురామ కృష్ణంరాజు అయ్యో పాపం పాపయమ్మ .. కట్టుకున్నోడు వదిలేశాడు.. అంటూ సానుభూతి పాట పాడి సింపతీ చూపించారు. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వం చేసిన పనులకు ప్రజలు ఈ విధంగా రేవంజ్ తీర్చుకున్నారు అని ఆయన అన్నారు. ఇక ముందు ముందు ఎలక్షన్స్ లో జగన్ ఓడిపోతాడు అనడానికి ఇంతకంటే మరేదైనా నిదర్శనం కావాలా అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా జగన్ పార్టీ అభ్యర్థి పులివెందులలో పరాజయం పాలవడం టీడీపీ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీ అని స్పష్టంగా అర్థం అవుతుంది.