TDP -YCP : సీఎం జగన్ కి ఝలక్.. టీడీపీ సభ్యుల్లో కలిసిపోయిన వైసీపీ ఎమ్మెల్యే..

TDP -YCP : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే ముందుగా గవర్నర్ ప్రసంగం జరిగింది. ఆ సందర్భంలోనే అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. సభలోని సభ్యులు అందరూ ఓవైపు టీడీపీ సభ్యులు, మరోవైపు వైసీపీ సభ్యులు కూర్చున్నారు. ఇందులో ముఖ్యంగా వైసిపి ఎమ్మెల్యే ఆనం.. టిడిపి సభ్యుల వైపు కూర్చోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అయితే కొన్నాళ్ల నుంచి ఆయన వైసీపీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా పార్టీ మారవచ్చనే టాక్ వినిపించింది. ఆయన టీడీపీ సభ్యుల వైపు కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది.

Ycp mla sit on TDP side Jagan has twist
Ycp mla sit on TDP side Jagan has twist

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమైయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన రోజునే అసెంబ్లీలో ఆనం రామనారాయణ రెడ్డి.. పార్టీని మార్చడం దీంతో పార్టీ అధిష్టానం కూడా ఘాటుగానే స్పందించింది. ఆయనను వెంకటగిరి వైసీపీ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించింది. అంతేకాకుండా ఆయన స్థానంలో నేదురు మల్లి వారసుడిని నియమించింది. అప్పటినుంచి ఆయన మాటలకు ఇంకా పదును పెరిగింది. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయం అనే కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో టిడిపి సభ్యుల వైపు కూర్చోవడం ఆసక్తికరంగా మారింది.

ఏపీలో అన్ని వ్యవస్థలు దిగజారిపోయాయని.. మరియు విలువలు లేకుండా పోయాయని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ ఎన్నికల అధికారుల సైతం వారి విధులు కూడా సక్రమంగా నిర్వహించలేని స్థితికి వెళ్లిపోయారని వాక్యానించారు. ఎన్నికలు నవ్వుల పాలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుంది. కావున ఎన్నికల ముందే వారు చర్చించి సమావేశాలకు సిద్ధమవ్వడం అనేది చాలా అవసరం. ఇలా ఎన్నికల సమావేశాలకు ముందే అందరూ కలిసి చర్చించుకోవడం వల్ల ఎటువంటి వేలాకుల పరిస్థితులు కూడా ఎదురవకుండా చూడవచ్చు అంటూ తెలిపారు.

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి

https://www.youtube.com/watch?v=ZmVFA2YRhSk