YCP : ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన సంగతి తెలిసిందే. ఊహించని రీతిలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవటం జరిగింది. ఏకంగా వైసీపీ బలంగా ఉండే రాయలసీమ ప్రాంతంలో కూడా టీడీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. అయితే కొన్ని చోట్ల అధికారులు అవకతవకులు చేసినట్లు.. అందుకే తెలుగుదేశం పార్టీ గెలిచినట్లు వైసీపీ నేతలు ఆరోపించడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ రాయటం మాత్రమే కాదు అవకతవకలు జరిగిన చోట్ల రికౌంటింగ్ చేయాలని సూచించింది.
పరిస్థితి ఇలా ఉంటే నెల్లూరు జిల్లా కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అధికారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా ఎన్నికల పోలింగ్ జరిగే రోజు ఓ అధికారిపై.. ఒరేయ్.. రేయ్ చంద్రబాబుపై అంత అభిమానం ఉంటే వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరారా పోయి. అటువంటప్పుడు ఇక్కడ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై అధికార వర్గాలలో తీవ్ర అసహనం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ పుంజుకోవటం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. 9 జిల్లాలలో 108 నియోజకవర్గాలలో దాదాపు పది లక్షలకు పైగా గ్రాడ్యుయేట్ ఓటర్లు.. స్వచ్ఛందంగా ఓట్లు వేయడం జరిగింది. ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ పైసా ఖర్చు పెట్టలేదు.
దీంతో వచ్చిన ఫలితాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఫుల్ సంతోషంగా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాల విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇది వైసీపీకీ వార్నింగ్ లాంటిదని హెచ్చరించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో జరిగిన చాలా ఎన్నికలలో వైసీపీ తిరుగులేని విజయాలు సాధించింది. కానీ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం గెలవటం వైసీపీ నేతలకు కూడా షాక్ ఇచ్చినట్లయింది.