Kotam Reddy Sridhar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉంచాలని దాదాపు 1200 రోజులకు పైగా ఆ ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పలు నిరసన కార్యక్రమాలు పాదయాత్రలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ ఉద్యమంలో వైసీపీ నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తమ ప్రాంతంలో రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్రలో పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో తుఫానులు వరదలు కారణంగా మానవతావాదతో మాట్లాడటం జరిగింది. కానీ ఇప్పుడు పార్టీ నుండి సస్పెండ్ కావడంతో స్వేచ్ఛగా అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉండటంతో… అమరావతి ఉద్యమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
ఆనాడు ప్రతిపక్షంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని స్వాగతించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చడం అన్యాయమని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించటం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని స్పష్టం చేశారు. నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు.
ఇంకా ఇదే కార్యక్రమంలో పలువురు బిజెపి పార్టీ నేతలు కూడా పాల్గొనడం జరిగింది. అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉంచాలని స్పష్టం చేశారు. మూడు రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఏడాది ఎన్నికలు వస్తున్న తరుణంలో అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించకపోవడం తప్పు పట్టారు. ఏది ఏమైనా రాజధానుల వ్యవహారంలో వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అమరావతి రైతుల బాధను అర్థం చేసుకుని.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే గుర్తించాలని నేతలు చెప్పుకొస్తున్నారు.