Kotam Reddy Sridhar Reddy : టిడిపిలో చేరిన వైసీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..

Kotam Reddy Sridhar Reddy : ఏపీ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పసుపు కండవాగప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల్లో నిరంతరం ఉంటూ సమాజానికి సేవ చేయాలనే తపన ఉండే వ్యక్తి గిరిధర్ రెడ్డి అని కొనియాడారు. వైసిపి సేవాదళ అధ్యక్షుడే రాజీనామా చేశాడంటే.. ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించడం పట్ల చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు గాలి మాత్రమేనని.. రాబోయే ఎన్నికల్లో సునామీ వస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సునామీలో వైసీపీ నేతలు అడ్రస్ లేకుండా కొట్టుకోవడం ఖాయమని తెలిపారు.

టిడిపి కుటుంబంలో నన్ను భాగస్వామిని చేసిన చంద్రబాబుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం చాలా అవసరం ఉంది. అందరి సలహాలు, సూచనలు తీసుకున్నాకే టిడిపిలో చేరానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. మాతోపాటు మమ్మల్ని నమ్ముకుని ఈ పార్టీలోకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు అని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు.

కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి టిడిపిలోకి రాకతో వైసీపీలో గుబులు మొదలైంది. వైసీపీలో కీలక నేతలు వరుసగా టీడీపీ బాట పడుతున్నారు. మరికొన్నాళ్లలో ఈ సంఖ్య మరింతగా పెరగనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ముందుగానే టిడిపి ప్రభుత్వం గెలుస్తుందని ఊహాగానాలు ఎక్కువయ్యాయి.

https://youtube.com/watch?v=GPeNyWlDuhU