Ys Jagan : సీఎం జగన్ నేడు తాడేపల్లిలో పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఇంచార్జ్ లతో వర్క్ షాప్ నిర్వహించటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి గైర్హాజరయ్యారు. కరోనా కారణంగా మంత్రి బుగ్గన సీఎం అనుమతి తీసుకుని రాలేకపోయారు. దీంతో ఇప్పుడు కొడాలి, వల్లభనేని వంశీ, ఆల రామకృష్ణారెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం జగన్ కి ముందు నుండి అత్యంత దగ్గరగా ఉండే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసహనంగా ఉన్నట్లు సమాచారం. ఏపీ రాజధాని ప్రాంతంలో ఒక భాగం మంగళగిరి నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలనం సృష్టించారు.
అయితే అమరావతి రాజధాని విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరు తీసుకున్న నిర్ణయాలు స్థానికంగా ఉన్న ఆర్కేకి ప్రజా వ్యతిరేకత తీసుకువచ్చినట్లు దీంతో వైసిపి వ్యవహారంపై ఆయన అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన కుమారుడు వివాహం హైదరాబాదులో జరిగిన క్రమంలో కనీసం సీఎం జగన్ కి పిలుపు కూడా ఇవ్వలేదనీ టాక్. పతిస్తితి ఇలా ఉండగా గత కొంతకాలంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ మారబోతున్నట్లు ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితులలో జగన్ వర్క్ షాప్ కి ఎమ్మెల్యే ఆర్కే గైర్హాజరవటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇక ఇదే సమయంలో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అంతర్గత విభేదాలతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసంతృప్తితో ఉండటంతో గైర్హాజరైనట్లు సమాచారం. ఇంకా కొడాలి నాని సైతం… ఈ సమావేశానికి రాకపోవడం సంచలనంగా మారింది. జగన్ కి అత్యంత నమ్మిన బంటు కావటంతో.. ఏ కారణంగా కొడాలి నాని రాలేదు అన్నది ఆసక్తికరంగా ఉంది. వీళ్లు మాత్రమే కాదు ఏలూరు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా వర్క్ షాప్ కి రాకపోవడంతో.. వైసీపీలో చాలామంది అసమ్మతి నేతలు లిస్టు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.