Ys jagan తెలుగు రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్..బీజేపీ పార్టీతో వ్యవహరిస్తున్న తీరు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతుంది. బీజేపీతో ఓపెన్ గా పొత్తు లేకపోయినా గాని.. జగన్ పార్టీ అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎక్కడా కూడా పొత్తుకి సంబంధం లేకుండా..బీజేపీ కూడా జగన్ ప్రభుత్వాన్ని కొన్ని విషయాల్లో ఆదుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

లోపాయికారి ఒప్పందంతో బీజేపీ…వైసీపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని అంటున్నారు. ఇటువంటి పరిస్థితులలో సిపిఎం నాయకుడు బీవీ రాఘవులు ఇటీవల ఓ కార్యక్రమంలో బీజేపీతో జగన్ బంధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిజెపి ప్రభుత్వం ఎవరిని మాట్లాడనీయని పరిస్థితి క్రియేట్ చేసిందని చెప్పుకొచ్చారు. మొత్తం కూడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా రాజకీయాలు చేస్తుందని.. ఈ క్రమంలో పెట్టుబడిదారులను కూడా మాట్లాడినవ్వకుండా ఎక్కడికక్కడ చట్టాలను ఉపయోగించి కట్టడి చేస్తున్నట్లు బీవీ రాఘవులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ రీతిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం, స్టీల్ ప్లాంట్, అమరావతి, పారిశ్రామిక రంగంలో అన్ని విషయాల్లో కూడా కేంద్రం కనుసన్నల్లో రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని.. కేంద్రం చెబుతున్న వారికి దోచి పెట్టేస్తుంది. చట్టపరంగా రాష్ట్రానికి రావలసిన విషయాలలో నోరు కూడా మెదపని పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. కేసులు భయం అందరికీ చుట్టుకుందని అందువల్లే జగన్ కూడా ఏమి చేయలేని పరిస్థితి అన్నట్టు సీపీఎం నేత బీవీ రాఘవులు.. కీలక వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా జగన్ కేసులు బయటపెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని అందువల్లే జగన్..బీజేపీకీ సహకరిస్తున్నట్టుగా రాఘవులు ప్రసంగించారు.