YS Viveka case : సిబిఐ విచారణకు ముందే అవినాష్ రెడ్డికి పై స్ట్రాంగ్ పాయింట్ వెతికిన సునీత..

YS Viveka case : మాజీ ఎంపీ వైఎస్ వివేకా ప్రాణాలు తీసిన కేసులో విచార‌ణ తీరుపై క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసులో సీబీఐ విచార‌ణ సంస్థ తీరును త‌ప్పుప‌ట్టారు. త‌నను విచారిస్తున్న వైనాన్ని వీడియో రికార్డింగ్ చేయాల‌ని కోరినా సీబీఐ అధికారులు ప‌ట్టించుకోలేద‌ని.. ఒక ల్యాప్ టాప్ ను ముందు కూర్చో బేడుతున్నార‌ని తెలిపారు. త‌న‌కు ఈ కేసులో సునీత‌కు సీబీఐ డైరెక్టుగా లీకులు ఇస్తోంద‌ని కూడా అవినాష్ అన్నారు. కాగా సునీత ఈ కేస్ విషయంలో ముందు నుంచి గట్టి పోరాటం చేస్తుంది.

Viveka case on ys Avinash Reddy Sunitha
Viveka case on ys Avinash Reddy Sunitha

వివేకా కేస్ లో త‌న‌ను ఇరికించే కుట్ర జ‌రుగుతోంద‌ని.. నేను పోరాటం చేస్తానంటూ అవినాష్ రెడ్డి అన్నారు. వివేకా మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న ఇంటికి వెళ్ల‌మంటూ త‌న‌కు కాల్ చేసిందే వివేక కూతురు, అల్లుడు అని .. వారే త‌న‌ను అక్క‌డ‌కు వెళ్ల‌మ‌ని చెప్పి .. త‌న‌పై కుట్ర‌లో వారు భాగ‌స్వామ్యులు అవుతున్నార‌ని అవినాష్ రెడ్డి అన్నారు. వివేకానంద‌రెడ్డి గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్టుగా త‌నెప్పుడూ చెప్ప‌లేద‌ని అవినాష్ రెడ్డి మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఆ రోజు ప్రెస్ మీట్ ను చూసినా ఈ విష‌యం స్ప‌ష్టం అవుతుంద‌న్నారు.

2019 ఎన్నిక‌ల్లో వివేకానంద‌రెడ్డి త‌న త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా పాల్గొన్నార‌ని.. రాజ‌కీయంగా త‌మ‌కు అడ్డు అవుతాడ‌ని తాము హ‌త్య చేసిన‌ట్టుగా ఎలా ప్ర‌చారం చేస్తారంటూ అవినాష్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఈ కేసులో కుట్ర‌లు జ‌రుగుతున్నాయ‌ని.. వాటిని త‌ను న్యాయ‌ పోరాటంతోనే ఎదుర్కొంటానంటూ అవినాష్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై టిడిపి నేత స్పందించారు.

గత ఎలక్షన్ అప్పుడు ఏమన్నారండీ ఎంపీ అవినాష్ రెడ్డి.. 25 ఎంపీ సీట్లు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా తీసుకువస్తాను. నేను వెళ్లి వాళ్ళ మెడలు వంచుతాను. మోడీకి వ్యవహారం చూస్తాను అని అప్పుడు ఆయన అన్నారు. కానీ ఆయన చేసింది ఏంటి? ఈయనే మెడలు వంచి కాళ్లు చేతులు దగ్గర పెట్టుకొని మోడీకి నమస్కారం చేసి తన మీద ఉన్న కేసులు మాఫీ చేయమని రిక్వెస్ట్ చేశారని ఆయన అన్నారు.

మోడీకి పాదాభివందనం చేసి వీళ్ళ కేసులు మాఫీ చేసుకోవడం తప్ప ఏం జరగలేదని ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు తప్పు మాట్లాడారు అనేది క్లారిటీ గా అందరికీ అర్థం అవుతుంది. 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు అంతేకాకుండా యువతికి ఉపాధి కల్పించడంలో ముందు అడుగు వేస్తా అన్నారు. కానీ ఇప్పుడు యువత కి ఏం చేశారో అందరికీ తెలుసు అని గుర్తు చేశారు. గతంలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడిన మాటలను మరోసారి గుర్తు చేశారు టిడిపి నాయకుడు.

కింద వీడియో లో పూర్తి సమాచారం ఉంది చూడండి

https://www.youtube.com/watch?v=7qNNZTYIGJc