YS Sharmila : అవినాష్ రెడ్డి, సిబిఐ విచారణపై సంచనాల వ్యాఖ్యలు చేసిన షర్మిల..

YS Sharmila : మాజీ మంత్రి వివేకా వధ కేసు విచారణ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై సిబిఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసింది. వివేకా ను సునీల్ యాదవ్ ఇతర నిందితులతో కలిసి హత్య చేశారన్న సిబిఐ హత్య జరిగిన రాత్రి సునీల్ వయస అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారని తెలిపింది. అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలతో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని.. ఎంపీ టికెట్ అవినాష్ కి బదులుగా తనకు ఇవ్వాలని వివేకా కోరుతున్నారని వివరించింది.. తాజాగా ఈ కేసు విషయంపై వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఎంపీ టికెట్ షర్మిల విజయమ్మ లేదంటే తనకు ఇవ్వాలని వివేకా కోరినట్లు సిబిఐ వెల్లడించింది. వివేకా రాజకీయ వ్యూహాలు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి నచ్చలేదని.. శివశంకర్ రెడ్డి తో కలిసి అవినాష్, భాస్కర్ రెడ్డి కుట్రపల్లి నట్లు కనిపిస్తోంది అని దర్యాప్తులో సిబిఐ తెలిపింది. సాక్షాల ప్రకారం శివశంకర్ రెడ్డితో కలిసి అవినాష్, భాస్కర్ కుట్ర పన్నినట్లు కనిపిస్తుంది
అని తెలిపారు. ఐదుగురుతో కలిసి అవినాష్ రెడ్డి వివేకాను సంహారం చేసిన స్థలానికి వెళ్లారని చేపింది. సిబిఐ వివేకా గుండెపోటుతో మరణించినట్లు అవినాష్ రెడ్డి స్థానిక సిఐ కి సమాచారం ఇచ్చారని తెలిపింది.

అవినాష్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వివేక వధ ను దాచి పెట్టేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోందని సిబిఐ తెలిపింది. కుట్రలో భాగంగానే గుండె, రక్త విరోచనాలు కథ అల్లినట్లు సీబీఐ తెలిపింది. నిందితులు వివేకా వధ జరిగిన స్థలాన్ని శుభ్రం చేశారని సిబిఐ అధికారులు తెలిపారు వివేకా శరీరంపై గాయాలు కనిపించకుండా బ్యాండేజ్ కట్టారని వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే సిబిఐ ఎందుకు ఎవరో బయటకు తెలిపింది.

తాజాగా మీడియా ముందుకు వచ్చిన వైఎస్ షర్మిల మందు తాగడం పై వాటిని యదేచ్చగా అమ్ముతున్నారన్న అంశంపై మాట్లాడగా.. ఆ తరువాత విలేఖరి వైయస్ వివేకా కేసు గురించి అడగగా.. చట్టం తన పని తాను చేయాలి సిబిఐ తన కార్యక్రమం తను చేస్తోంది. తొందరగా చేయాలని కోరుతుంది వైయస్సార్ కుటుంబం.. అని వైయస్ షర్మిల మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.